సోష‌ల్ మీడియా సాక్షిగా.. ఆ ద‌ర్శ‌కుడికి ఐలవ్‌యూ చెప్పిన సమంత..!

Wednesday, October 31st, 2018, 01:24:56 PM IST

అక్కినేని వారి కోడ‌లు స‌మంత సోష‌ల్ మీడియాలో నిత్యం యాక్టీవ్‌గానే ఉంటుంది. త‌న‌కు సంబంధించిన చాలా విష‌యాలు సోష‌ల్ మీడియా ద్వారా త‌న అభిమానుల‌తో షేర్ చేసుకుంటుంది సమంత‌. అయితే తాజాగా స‌మంత‌.. సోష‌ల్ మీడియాలో ఓ డైరెక్ట‌ర్‌కి ఐల‌వ్‌యూ చెప్పిందనే వార్త సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది. అయితే సామ్ సినిమాలో భాగంగా చెప్పిందా.. లేక నిజంగానే చెప్పిందా అనేది తెలియాలంటే.. అసలు మ్య‌ట‌ర్‌లోకి వెళ్ళాల్సిందే.

ఇటీవ‌ల స‌మంత యూట‌ర్న్ అనే చిత్రంలో న‌టించిన సంగ‌తి తెలిసిందే. అయితే ఆ చిత్ర ద‌ర్శ‌కుడు ప‌వ‌న్ కుమార్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా సోమ‌వారం త‌న సోష‌ల్ మీడియా ద్వారా శుభాకాంక్ష‌లు తెల్పుతూ.. ప‌వ‌న్ కుమార్ ద‌ర్శ‌కుడిగా నువ్వంటే నాకు చాలా ఇష్టం.. నేను నిన్ను చాలా ద‌గ్గ‌రిగా చూశాను.. నా లైఫ్‌లో నువ్వు చాలా ప్ర‌త్యేక‌మైన వ్య‌క్తివి.. నేనెప్ప‌టికీ నీ అభిమానినే..నీతో క‌లిసి ప‌నిచేసినందుకు చాలా గ‌ర్వంగా భావిస్తున్నాను.. నీ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ప్ర‌తీ సినిమా నేను త‌ప్ప‌కుండా చూస్తాను.. ఐలవ్‌యూమై ఫ్రెండ్ అంటూ ప‌వ‌న్‌కు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు చెప్పింది స‌మంత. దీంతో ఈ మ్యాట‌ర్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

  •  
  •  
  •  
  •  

Comments