యూ టర్న్ చిత్రంకి 23 కోట్లు వచ్చాయా?నిజమేనా..?

Wednesday, September 26th, 2018, 08:31:30 PM IST

వినాయకచవితి సందర్భంగా సమంతా ప్రధాన పాత్రదారినిగా మరియు ఆది పినిశెట్టి హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం “యూ టర్న్”. ఆరంభం నుంచే మంచి టాక్ సంతరించుకున్న ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకొని,మొదట్లో బాగానే వసూళ్లను రాబట్టింది,కానీ అలా రోజులు గడుస్తన్న కొద్దీ ఈ చిత్రానికి ఆదరణ బాగా తగ్గిపోయింది.

మొదటి రెండు మూడు రోజులు పట్టించుకున్న జనం తర్వాత ఈ చిత్రాన్ని చూడటానికి మొహం చాటేస్తున్నారు.విమర్శకుల నుంచి ప్రశంసలు వచ్చినా,రివ్యూలు కూడా సహకరించినా ఎందుకో ప్రేక్షకులు ఈ చిత్రాన్ని పట్టించుకోవడం లేదు,అంతెందుకు ముందు డివైడ్ టాక్ తో మొదలైన శైలజ రెడ్డి అల్లుడు ఇప్పుడు లాభాల బాట పడుతుంది.కానీ సమంతా పరిస్థితి మాత్రం మల్టీప్లెక్సుల్లో ఓ మోస్తరుగా జనం వస్తున్నా మిగతా చోట్ల మాత్రం యూ టర్న్ వసూళ్లు మాత్రం తగ్గిపోయాయి అని ట్రేడ్ పండితులు అంటూ,అలాంటిది 23 కోట్లు ఎలా వచ్చాయి అంటూ నవ్వుతున్నారు.ఈ చిత్రం ఆరంభం బాగానే ఉన్న ముగింపు మాత్రం నష్టాలతోనే ఉంటుంది అని అభిప్రాయపడుతున్నారు.