ఇద్దరూ దాదాపు ఒకే సెంటిమెంట్..ఏమవ్వుద్దో ఏంటో.?

Monday, December 9th, 2019, 08:53:40 PM IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరియు సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు టాలీవుడ్ లో ఈ ఇద్దరే ఎక్కువగా హాట్ టాపిక్ గా నిలుతున్నారు.వీరిరువురూ తమతమ చిత్రాలతో తమ అభిమానులను మరియు మూవీ లవర్స్ ను రంజింపజెయ్యడానికి సన్నద్ధం అవుతున్నారు.”అల వైకుంఠపురములో”తో త్రివిక్రమ్ మార్క్ కోసం అలాగే “సరిలేరు నీకెవ్వరు”తో అనీల్ రావిపూడి పక్కా ఎంటర్టైన్మెంట్ కోసం అభిమానులు పెద్ద ఎత్తున ఎదురు చూస్తున్నారు.అయితే ఈ ఇద్దరి హీరోలు దాదాపు ఒకే సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నారు.

మొదటగా తమ చిత్రాలను సంక్రాంతి బరిలో ఒకే తేదీన విడుదల చేయబోతున్నాం అని చెప్పి ప్రయతించినప్పటి నుంచి ఏ రెండు చిత్రాలు టాలీవుడ్ లో ఓ సరికొత్త హీట్ ను రేపాయి.ఇదొక్కటే కాకుండా చాలా విషయాల్లో ఏఈ రెండు చిత్రాల ప్రమోషన్లో పోటీ వాతావరణం నెలకొంది.అదే విధంగా వీరు ఒకే సెంటిమెంట్ ను కూడా ఎక్కువగా ఫాలో అవుతున్నారు.అటు సరిలేరు నీకెవ్వరు అప్డేట్స్ ను 5 గంటల 4 నిమిషాలకు వారు అందిస్తుంటే మరోపక్క అల వైకుంఠపురములో టీమ్ మాత్రం రివర్స్ లో 4 గంటల 5 నిమిషాలకు ఇస్తుంది.మొత్తంగా రెండు సినిమా యూనిట్లు మాత్రం లక్కీ నెంబర్ 9 వచ్చేలా జాగ్రత్త పడుతున్నారు.మరి ఈ సెంటిమెంట్లు ఎంత వరకు వీరి చిత్రాలను గట్టెక్కిస్తాయో చూడాలి.