సూర్య – శంక‌ర్ కాంబినేష‌న్ పై గుస‌గుస‌?

Monday, July 22nd, 2019, 08:25:33 PM IST

ర‌జ‌నీకాంత్.. క‌మ‌ల్ హాస‌న్.. అర్జున్.. విక్ర‌మ్.. విజ‌య్ వీళ్లంద‌రితో ప‌ని చేశారు స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్. ర‌జ‌నీ.. క‌మ‌ల్ హాస‌న్ తో రిపీటెడ్ గా సినిమాలు చేస్తున్నారు. కానీ ఆయ‌న ఇప్ప‌టివ‌ర‌కూ నెక్ట్స్ జెన్ స్టార్ సూర్య‌తో మాత్రం సినిమా తీయ‌లేదు ఎందుక‌నో. ఆ అవ‌కాశం సంద‌ర్భం ఇప్ప‌టివ‌ర‌కూ రాలేదు. కానీ ప్ర‌స్తుత స‌న్నివేశం చూస్తుంటే సూర్య‌తో శంక‌ర్ ఓ చిత్రానికి ప్లాన్ చేసే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. అందుకు లైకా సంస్థ ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తోంద‌న్న‌ గుస‌గుస‌లు కోలీవుడ్ మీడియాలో వేడెక్కిస్తున్నాయి. అందుకే నిన్న‌టిరోజున సూర్య – కేవీ ఆనంద్ కాంబినేష‌న్ మూవీ `కప్పాన్` (బందోబ‌స్త్) ఆడియో వేడుక‌కు శంక‌ర్ ప్ర‌త్యేక అతిధిగా ఎటెండ‌య్యారు. ఈ చిత్రాన్ని లైకా సంస్థ నిర్మిస్తోంది కాబ‌ట్టి ఆయ‌న వేదిక‌పైకి వ‌చ్చార‌నుకుంటే పొరపాటేన‌ని సూర్య కోసం శంక‌ర్ వేరొక స్క్రిప్టును రెడీ చేస్తున్నార‌ని ప్ర‌చారం సాగుతోంది.

ఇక శంక‌ర్ లాంటి స్టార్ డైరెక్ట‌ర్ల‌తో న‌టించే స్టామినా ఉన్న హీరో సూర్య అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. ప్ర‌స్తుతం శంక‌ర్ క‌మ‌ల్ హాస‌న్ హీరోగా `భార‌తీయుడు 2` (ఇండియ‌న్ 2) చిత్రీక‌ర‌ణ‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాతో పాటుగా విజ‌య్ హీరోగానూ సినిమా తీసేందుకు రెడీ అవుతున్నార‌ని వార్త‌లొస్తున్నాయి. ఇక క‌ప్పాన్ వేదిక‌పై సూర్య ప్ర‌తిభ‌ను శంక‌ర్ ఆకాశానికెత్తేశారు. శంక‌ర్ మాట్లాడుతూ – “సూర్య రాను రానూ యువ‌కుడిలా మారుతున్నారు. ప‌ర్ ఫెక్ష‌నిస్ట్‌.. డెడికేష‌న్ ఉన్న న‌టుడు. ఈ సినిమా త‌న‌కు వ‌న్ ఆఫ్ ది బెస్ట్ మాస్ సినిమాగా నిలిచిపోవాల‌ని కోరుకుంటున్నాను“ అని అన్నారు. చాలా మంచి టీమ్‌కుదిరింది. సూప‌ర్‌హిట్ క‌మ‌ర్షియ‌ల్ సినిమాకు ఉండాల్సిన అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయి. క‌థ .. పెర్ఫామెన్స్‌.. యాక్ష‌న్‌.. విజువ‌ల్స్‌.. మ్యూజిక్ ఇలా అన్ని అద్భుతంగా కుదిరాయి. తెర‌పై సూర్య‌, కె.వి.ఆనంద్‌గారి కష్టం క‌న‌ప‌డుతుంది. కె.వి.ఆనంద్‌గారు నా ద‌గ్గ‌ర ప‌నిచేసేట‌ప్పుడు సీన్ బాగా రావ‌డానికి ఎంత ఆలోచిస్తారో నాకు తెలుసు. సుభాస్క‌రన్ వంటి ప్యాష‌నేట్ ప్రొడ్యూస‌ర్ ఈ సినిమాకు నిర్మాత కావ‌డం ఆనందించ‌ద‌గ్గ విష‌యం. `బందోబస్త్’ వంటి మంచి చిత్రాల‌ను మ‌రిన్నింటిని ఆయ‌న నిర్మించాల‌ని కోరుకుంటున్నాను. హ్యారిశ్ జైరాజ్ సూప‌ర్బ్ మ్యూజిక్ అందించాడు. ఎంటైర్ యూనిట్‌కు ఆల్ ది బెస్ట్‌“ అన్నారు.

ఇక ఇదే వేదిక‌పై శంక‌ర్ ని ఉద్ధేశించి సూర్య మాట్లాడుతూ.. న‌న్ను ఆశీర్వ‌దించ‌డానికి వ‌చ్చిన శంక‌ర్‌ ప్ర‌తి సినిమాతో మ‌న సినిమాల‌ను నెక్ట్స్ లెవ‌ల్‌కు తీసుకెళుతున్నార‌ని ప్ర‌శంసించారు. వేడుక‌లో హీరో సూర్య మాట్లాడుతూ – “కె.వి.ఆనంద్ తో నా జ‌ర్నీ ఎప్ప‌టి నుండో కొన‌సాగుతుందో ప్రేక్షకులకు తెలుసు. ఆయ‌న‌తో `అయాన్‌`(వీడొక్క‌డే).. `మాట్రాన్‌ (బ్ర‌ద‌ర్స్‌) చిత్రాలు చేశాను. ఇది మా క‌ల‌యిక‌లో వ‌స్తోన్న మూడో సినిమా. ఆయ‌న గొప్ప ప‌ని రాక్ష‌సుడు. అంద‌రినీ మెప్పించే సినిమా దీన్ని మ‌లిచాడు. ఇందులో నేను స్పెష‌ల్ ప్రొటెక్ష‌న్ గ్రూప్ సభ్యుడి పాత్ర‌లో న‌టించాను. ఈ సినిమా ఇంత గొప్ప‌గా వ‌చ్చిందంటే ముందుగా నిర్మాత సుభాస్క‌రన్‌కి థ్యాంక్స్ చెప్పుకోవాలి. సినిమాలో మోహ‌న్‌లాల్‌తో క‌లిసి న‌టించ‌డం అదృష్టంగా భావిస్తున్నాను. ఒక అన్న‌లా ఆద‌రించారు. ఎన్నో కొత్త విష‌యాల‌ను చెప్పారు. ఆయ‌న‌తో కలిసి 25 రోజుల పాటు ప‌నిచేశాను. ఇది నాకు ఎంతో ఇంపార్టెంట్ సినిమా. అలాగే… సినిమాలో ఆర్య‌, స‌యేషా జంట మంచి న‌ట‌న‌ కన‌ప‌రిచారు. ఈ సినిమాలో ఆర్య ఉన్న‌ప్ప‌టికీ నేను స‌యేషాతో జంట‌గా న‌టించాను. ప్రేక్ష‌కులు న‌న్ను ఇంతలా ఆశీర్వ‌దిస్తార‌ని నేను క‌ల‌లో కూడా అనుకోలేదు. మ‌న ప్ర‌య‌త్నం త‌ప్పుకావ‌చ్చు. కానీ.. ప్ర‌య‌త్నాలు చేయ‌డం మాత్రం మానుకోకూడ‌దు. అంద‌రూ అలాగే క‌ష్ట‌ప‌డితే, త‌ప్ప‌కుండా స‌క్సెస్ వ‌స్తుంది. గొప్ప గొప్ప‌వారికే జ‌యాప‌జ‌యాలు త‌ప్ప‌లేదు. ర‌జ‌నీ దారి ఎప్పుడూ ర‌హ‌దారే. ఆయ‌న ఒక తెరిచిన పుస్త‌కం. ఆయ‌న దారిలో మ‌రొక‌రు రాలేరు. రియ‌ల్ లైఫ్‌లో ఆయ‌నొక హీరో“ అని అన్నారు.