ఫేక్ కలెక్షన్స్ లో పోటీపడుతున్న “సరిలేరు”, “వైకుంఠపురములో”

Monday, January 13th, 2020, 07:29:00 PM IST

ఈ సంక్రాంతి కానుకగా తెలుగు బాక్సాఫీస్ దగ్గరకు సందడి చెయ్యడానికి టాలీవుడ్ నుంచి సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లు కేవలం ఒక రోజు గ్యాప్ తో తమ చిత్రాలు “సరిలేరు నీకెవ్వరు” అలాగే “అల వైకుంఠపురములో” చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రెండు రోజుల ముందే సంక్రాంతి వాతావరణంను తీసుకొచ్చేసారు.అయితే ఈ రెండు చిత్రాలకు కూడా వాటి మొదటి ఆటతోనే వీరిద్దరి కెరీర్లో ఏ చిత్రం కూడా తెచ్చుకోని విధమైన బ్లాక్ బస్టర్ టాక్ ను సంతరించుకున్నాయి.

అయినప్పటికీ ఎందుకో వసూళ్ల విషయంలో మాత్రం ఇరు చిత్రాల యూనిట్లు ఒకరికి వారు ఏమాత్రం తీసిపోకుండా వ్యవహరిస్తున్నారు.అల వైకుంఠపురములో చిత్రం కంటే ఒక రోజు ముందే విడుదల కాబడిన “సరిలేరు నీకెవ్వరు” విషయానికి వస్తే ఈ చిత్రానికి ఏపీ మరియు తెలంగాణా రాష్ట్రాల్లో 30 కోట్ల షేర్ అలాగే ప్రపంచ వ్యాప్తంగా 40 కోట్ల షేర్ ను రాబట్టినట్టు అంతర్గత సమాచారం.కానీ వీటికి అదనంగా నిర్మాతలు మాత్రం ఇంకో 7 కోట్లు పెంచేసి 47 కోట్లు చేసేసారు.

వీరే అనుకుంటే వీరి కంటే ఒక ఆకు ఎక్కువే చదివాం అని “అల వైకుంఠపురములో” బృందం అయితే గుంటూరు మరియు కృష్ణా వసూళ్ల లెక్కలు పెంచేశారు.గుంటూరు లో “సరిలేరు నీకెవ్వరు” 5.11 కోట్ల షేర్ ను అలాగే కృష్ణ లో 3.7 కోట్లు మొదటి రోజు రాబట్టగా వీటిని అధిగమించినట్టుగా “అల వైకుంఠపురములో” మొదటి రోజు గుంటూరులో 5.14 కోట్లు అలాగే కృష్ణాలో 3.10 కోట్లు రాబట్టినట్టు చెప్తున్నారు.

అయితే ఇక్కడ మహేష్ చిత్రం బన్నీ కంటే ముందు వచ్చింది సో లాజిక్ ప్రకారం ఏ సినిమా లేనప్పుడు సరిలేరు నీకెవ్వరు కు షోలు కానీ స్క్రీన్లు కానీ ఎక్కువ ఉంటాయి.అలా అని వీరు మాత్రం తక్కువ చెప్పుకున్నారా పప్పన్నంలో కాస్త నెయ్యి ఎక్కువే వేసినట్టుగా 7 కోట్లు పెంచేశారు.అయినా రెండు చిత్రాలు మంచి టాక్ ను సంతరించుకున్నాయి.అలాంటప్పుడు ఇలా గొప్పలకు పోవడం అవసరమా..