రెండోసారి కూడా అదిరిపోయే టీఆర్పీ కొట్టిన మహేష్..ఈ దొంగలు కూడా బాగానే రాబట్టారు.!

Thursday, July 9th, 2020, 01:37:14 PM IST

గత జూన్ 28 న సూపర్ స్టార్ మహేష్ నటించిన లేటెస్ట్ చిత్రం “సరిలేరు నీకెవ్వరు” రెండవ సారి టెలికాస్ట్ కాబడిన సంగతి అందరికీ తెలిసిందే. మొదటి సారి టెలికాస్ట్ లోనే రికార్డు స్థాయి టీఆర్పీ రేటింగ్ ను సాధించిన మహేష్ రెండో సారి టెలికాస్ట్ లో కూడా బొమ్మ దద్దరిల్లించాడు.

ఈసారి ఏకంగా 17.4 టీఆర్పీ రేటింగ్ ను రాబట్టి సెకండ్ టెలికాస్ట్ లో కూడా రికార్డ్ నమోదు చేశాడు. జెమినీ ఛానెల్లో ఈ చిత్రం సాయంత్రం టెలికాస్ట్ కాగా అదే రోజు మధ్యాహ్నం స్టార్ మా ఛానెల్లో ప్రసారం అయిన “కనులు కనులను దోచాయంటే” సినిమా కూడా సత్తా చాటింది.

దుల్కర్ సల్మాన్, రక్షన్ హీరోలుగా రీతూ వర్మ మరియు నిరంజని హీరోయిన్ లుగా పెరియ సామి దర్శకత్వంలో తెరకెక్కిన ఇంట్రెస్టింగ్ థీఫ్ డ్రామా 7.1 టీఆర్పీ రేటింగ్ ను కొల్లగొట్టింది. ఒక డబ్బింగ్ సినిమా కు మన దగ్గర ఈ స్థాయిలో రేటింగ్ రాబట్టడం విశేషమే అని చెప్పాలి.