ఇక అసలు ఆట మొదలు పెట్టనున్న “సరిలేరు నీకెవ్వరు” టీమ్!

Thursday, November 14th, 2019, 04:48:10 PM IST

టాలీవుడ్ లోని ఉన్నటువంటి ఏ హీరోకి చెయ్యని విధంగా సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల తాలూకా ఆడియో ఫంక్షన్స్ కానీ ప్రీ రిలీజ్ వేడుకలు కానీ ఉంటాయి.ఇతర హీరోలతో పోలిచినట్టైతే మహేష్ ఇలాంటి విషయాల్లో కాస్త కొత్త కోణంలో వెళ్తారు.ఇలా మహేష్ కమర్షియల్ కు భిన్నంగా వెళ్తారు.అదే విధంగా మహేష్ కొత్త సినిమా వస్తుంది అంటే మహేష్ ఫ్యాన్స్ తమ క్రియేటివిటీను ఒక రేంజ్ లో ప్రదర్శిస్తారు.

అది ఇదివరకే పలుమార్లు నిరూపితం కూడా అయ్యింది.ఇదిలా ఉండగా ఇప్పుడు అనీల్ రావి పూడి దర్శకత్వంలో మహేష్ నటిస్తున్న తాజా చిత్రం “సరిలేరు నీకెవ్వరు” టీమ్ అసలు ఆట మొదలు పెట్టనుందని చెప్పాలి.మాములుగా ఒక స్టార్ హీరో సినిమా అంటే వారి ఇండస్ట్రీలో ఎలాంటి ప్రమోషన్స్ లేకపోయినా సరే చూసేస్తారు.కానీ ప్రమోషన్స్ చేస్తే ఆ చిత్రానికి మరింత ప్లస్ అవుతుంది.అదే వేరే లెవెల్లో చేస్తే ఎలా ఉంటుంది.

ఇప్పుడు సరిలేరు నీకెవ్వరు టీమ్ అదే ప్లానింగ్ లో ఉన్నారు.ఈ చిత్రానికి సంబంధించి స్కై లెవెల్ ప్రమోషన్స్ చెయ్యాలని భావిస్తున్నారు.అందుకోసమే కాస్త భిన్నంగా ఆసక్తికరంగా ప్రమోషన్స్ చేసే వారి కోసం చూస్తున్నట్టు తెలిపారు.దీనితో ఈసారి మాత్రం ఇప్పటి వరకు టాలీవుడ్ లో చూడని రేంజ్ ప్రమోషన్స్ సరిలేరు నీకెవ్వరు కి చూస్తారు అంటూ అభిమానులు అంటున్నారు.