టీజర్ పర్ఫెక్ట్ టాక్ : దేవి దెబ్బేసాడు..మహేష్ కుమ్మేసాడు.!

Friday, November 22nd, 2019, 05:29:41 PM IST

మహేష్ బాబు అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకొని ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న టీజర్ “సరిలేరు నీకెవ్వరు” టీజర్.అనిల్ మరియు మహేష్ ప్రాజెక్ట్ అనగానే ఇదొక పెద్ద క్రేజీ కాంబోగా మారిపోయింది.దీనితో ఈ సినిమా విషయంలో ఏ చిన్న విషయం బయటకు వచ్చినా సరే పెద్ద సెన్సేషన్ అయ్యేది.అలా అంచెలంచెలుగా టీం చిత్రంపై అంచనాలను పెంచేశారు.దీనితో ఈరోజు విడుదల కాబోతున్న టీజర్ విషయంలో అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకోగా వాటిని ఇప్పుడు సరిలేరు నీకెవ్వరు టీం తలకిందులు చేసేసింది.

టీజర్ ఆరంభమే మాంచి విజువల్స్ తో ప్రారంభం అయ్యినా దేవి తన రొటీన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో ఫక్తు అభిమానులకు మొదట్లోనే దెబ్బేసాడు.ఎందుకంటే అక్కడ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మహేష్ “స్పైడర్” కు అచ్చు దిగిపోయింది.ఇక ఆ తర్వాత మహేష్ పేల్చిన డైలాగ్స్ తన మ్యానరిజమ్స్ మాత్రం అభిమానుల్లో ఊపు తీసుకొస్తుంది.యాక్షన్ సీన్స్ కూడా బాగున్నాయి కానీ అభిమానులు చిత్ర యూనిట్ ఇచ్చిన ఎలివేషన్స్ కు ఇంకా మాస్ సీన్స్ ఊహించి ఉంటారు.

ఇక్కడ అనీల్ విఫలం అయ్యారు.అలాగే “గాయం విలువ తెలిసిన వాడే సాయం చేస్తాడు”అని లేడీ అమితాబ్ విజయశాంతి చెప్పిన డైలాగ్ టచ్ అవుతుంది.ఇక ఫైనల్ గా సంక్రాంతి రేస్ ను ఉద్దేశించి లాస్ట్ లో ప్రకాష్ రాజ్ “ప్రతీ సంక్రాంతికి అల్లుడు వస్తాడు కానీ ఈసారి మొగుడు వచ్చాడు”అంటూ చెప్పిన డైలాగ్ అదిరిపోయింది.మొత్తానికి ఈ టీజర్ మాత్రం జస్ట్ యావరేజ్ ఫ్లిక్ అని చెప్పాలి.దేవి మరియు అనీల్ మాత్రం అభిమానులకు గట్టి దెబ్బ వేసారని చెప్పాలి.