స‌ర్కార్ విడుద‌ల వారంలో.. మురుగ‌దాస్‌కు ఊహించ‌ని షాక్..!

Tuesday, October 30th, 2018, 04:26:10 PM IST

త‌మిళ్ స్టార్ హీరో విజ‌య‌.. సెన్షేష‌న్ డైరెక్ట‌ర్ మురుగ‌దాస్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన హ్యాట్రిక్ చిత్రం స‌ర్కార్. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని దీపావ‌ళి కానుక‌గా ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. భారీ బ‌డ్జెట్, విప‌రీత‌మైన అంచనాల‌తో ప్ర‌పంచ వ్యాప్తంగా 80 దేశాల్లో దాదాపుగా 1200 స్క్రీన్లలో స‌ర్కార్ రిలీజ్ కానుంది. దీంతో స‌ర్కార్ ఫీవ‌ర్ త‌మిళ‌నాడు ర‌చ్చ లేపుతుంటే.. తాజాగా ఒక వివాదం ఈ చిత్రాన్ని చుట్టుముట్టిన సంగ‌తి తెలిసిందే. అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే.. స‌ర్కార్ క‌థ త‌న‌దే అని వ‌రుణ్ అనే ర‌చ‌యిత ఆరోప‌ణ‌లు చేశారు.

ఈ క్ర‌మంలో తాను రాసుకున్న సెంకోల క‌థ‌ను 2007లోనే రచయితల సంఘంలో రిజిస్టర్ చేయించానని.. మురుగ‌దాస్ త‌న క‌థ‌ను కాపీ కొట్టాడ‌ని అందుకు ప‌రిహారంగా టైటిల్ కార్డ్స్‌లో త‌న పేరు, 30 ల‌క్ష‌ల రూపాయ‌లు ఇవ్వాల‌ని డిమాండ్ చేశాడు. అయితే తాజాగా మురుగ‌దాస్ స్పందించి.. త‌ను స‌ర్కార్ క‌థ‌ను ఎవ‌రి ద‌గ్గ‌ర కాపీ కొట్ట‌లేద‌ని తానే స్వ‌యంగా రాసుకున్నాన‌ని.. ఈ క‌థ కోసం నా అసిస్టెంట్స్ చాలా క‌ష్ట ప‌డ్డార‌ని.. అలాంటిది ఎవ‌రో వ‌చ్చి త‌న క‌థ అని చెబితే ఎలా ఒప్పుకుంటారు అని మురుగ‌దాస్ మండి ప‌డ్డారు.

అయితే కోర్టు వ‌ర‌కు వెళ్ళిన ఈ వ్య‌వ‌హారం.. కోలీవుడ్ నిర్మాత‌ల మండ‌లిలో కూడా త‌న‌కు న్యాయం చేయాల‌ని విన‌తిప‌త్రాన్ని అంద‌జేశార‌ని తెలుస్తోంది. దీంతో ఈ వ్యవ‌హారం ర‌చ‌యిత‌ల సంఘ వ‌ద్ద‌కు కూడా వెళ్ళ‌గా ర‌చ‌యిత‌ల సంఘ అధ్య‌క్షుడు కె. భాగ్య‌రాజా ఈ స‌ర్కార్ క‌థ కాపీనే అని తేల్చేశార‌ని టాక్. దీంతో ఆ ర‌చ‌యిత డిమాండ్స్‌కి ఒప్పుకోవ‌డం ఖాయ‌మ‌ని లేక‌పోతే కోర్టు మెట్లు ఎక్కాల్సి వ‌స్తుంద‌ని కోలీవుడ్‌లో టాక్ స్ప్రెడ్ అయ్యింది. మ‌రి ఈ వ్య‌వ‌హారం పై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తారో చూడాలి. ఏది ఏమైనా వారంలో స‌ర్కార్ విడుద‌ల కానుండ‌గా మురుగ‌దాస్‌కు ఊహించ‌ని షాక్ త‌గిలింద‌ని సినీ వ‌ర్గాల్లో చ‌ర్చించుకుంటున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments