“సర్కార్” విజయ్ కాదు పవన్ అభిమానులకు పండగ..!

Wednesday, November 7th, 2018, 10:00:46 PM IST

ఏ ఆర్ మురగదాస్ మరియు ఇళయ దళపతి విజయ్ కాంబినేషన్లో భారీ అంచనాల నడుమ విడుదలైన చిత్రం “సర్కార్”.ఈ చిత్రం విడుదల తర్వాత రకరకాల వార్తలు వచ్చినా సరే మురుగదాస్ మరియు విజయ్ ల కాంబో లో మళ్ళీ ఒక అద్భుత చిత్రాన్ని అయితే ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.నిన్న విడుదలైన ఈ చిత్రం విజయ్ అభిమానులకు ఎంత వరకు నచ్చిందో తెలీదు కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు మాత్రం ఓ రేంజ్ లో నచ్చిందని చెప్తున్నారు.

దానికి గల కారణాలు కూడా లేకపోలేవు,ప్రస్తుతం పవన్ రాజకీయాల్లో బిజీ గా ఉన్నారు,ఇప్పుడు పవన్ ఇక్కడి రాజకీయాల్లో ఏ పాత్ర అయితే పోషిస్తారో ఆ చిత్రంలో మురుగదాస్ విజయ్ ను అచ్చం అలాగే చూపించారు అని పవన్ యొక్క అభిమానులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.అంతే కాకుండా ఈ చిత్రంలోని కొన్ని సీన్లలో విజయ్ యొక్క నటన కూడా పవన్ ను అనుకరించేలా ఉంది అని పవన్ అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టుకుంటూ ఆనందంలో మునిగి తేలుతున్నారు.