విజ‌య్ స‌ర్కార్.. వీక్ ఎందుకు అయ్యింది..?

Tuesday, November 6th, 2018, 06:16:22 PM IST

త‌మిళ‌ ఇళయ దళపతి విజయ్.. సెన్షేష‌న్ డైరెక్ట‌ర్ మురుగ‌దాస్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన స‌ర్కార్ చిత్రం దీపావ‌ళి కానుక‌గా ఈ రోజే ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. భారీ బ‌డ్జెట్, విప‌రీత‌మైన అంచ‌నాలు, స్టార్ కాస్ట్‌, స్ట‌న్నింగ్ విజువ‌ల్స్ ఇన్నీ క‌లిపి స‌ర్కార్ చిత్రం పై అంచ‌నాలు పెంచేశాయి.
ఇక విజ‌య్-మురుగ కాంబినేష‌న్‌లో గ‌తంలో వ‌చ్చిన‌ తుపాకీ, కత్తి సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద‌ బ్లాక్ బస్టర్ హిట్స్ అవ‌డంతో ఈ హ్యాట్రిక్ చిత్రం పై. ఎక్కడలేని అంచాలు వచ్చేస్తాయి. మ‌రి భారీ హంగుల‌తో వ‌చ్చిన సర్కార్ మూవీని యావ‌రేజ్ అని తేల్చేశారు ప్రేక్ష‌కులు.

మురుగ‌దాస్ గ‌త చిత్రాలు చూస్తే ఏదో ఒక సామాజిక అంశం చుట్టూ క‌థ అల్లుకొని, దానికి త‌న‌దైన క‌మ‌ర్షియ‌ల్ ట్రీట్‌మెంట్ ఇచ్చి మంచి స‌క్సెస్‌లు సాధించాడు. అయితే ఇప్ప‌డు కూడా రాజ‌కీయ వ్య‌వ‌స్థ‌లు సామాన్యుల‌ ఓట్లను ఎలా దుర్వినియోగ పరుస్తున్నారు అనే ఆశ‌క్తిక‌ర‌మైన లైన్‌నే తీసుకున్నాడు. అయితే ఈసారి క‌థ‌కు త‌గ్గ ట్రీట్‌మెంట్ ఇవ్వ‌లేక‌పోయాడు మురుగ‌దాస్. క‌థ‌కు యాప్ట్ అయ్యే సీన్లు రాసుకొని త‌న‌దైన స్క్రీన్‌ప్లేతో మ్యాజిక్ చేసే మురుగ‌దాస్ ఈసారి మాత్రం క‌మ‌ర్షిల్ హాంగుల‌కు పోయి.. కేవ‌లం విజ‌య్ కోస‌మే తెర‌కెక్కించాడ‌నిపిస్తోంది. ఫ‌స్ట్‌హాఫ్‌లో క‌మ‌ర్షియ‌ల్ హాంగుల‌కు దూరంగా ఉన్న మురుగ‌.. సెకండ్‌హాఫ్‌లో మాత్రం లాజిక్ లేని స‌న్నివేశాల‌తో పూర్తిగా చేతులెత్తేశాడు. ప్రీక్లైమాక్స్‌లో వ‌ర‌ల‌క్ష్మీ-విజ‌య్‌ల మ‌ధ్య సీన్లు లేక‌పోతే స‌ర్కార్ ప‌రిస్థితి మ‌రింత ధారుణంగా ఉండేది. ఇక చివ‌రిగా హీరోయిజాన్ని ఎలివేట్ చేస్తూ సామాజిక అంశాలను గంగలో కలిపేసి స‌ర్కార్‌ని వీక్ చేశాడ‌ని మురుగ‌దాస్ పై సోష‌ల్ మీడియాలో కామెంట్లు ప‌డుతున్నాయి.

  •  
  •  
  •  
  •  

Comments