స‌ర్కార్ మూవీ.. జెన్యూన్ షార్ట్ రివ్యూ..!

Tuesday, November 6th, 2018, 11:19:56 AM IST

త‌మిళ స్టార్ హీరో విజ‌య్ న‌టించిన తాజా చిత్రం స‌ర్కార్. ఈ చిత్రానికి ఏఆర్ మురుగ‌దాస్ దర్శ‌క‌త్వం వ‌హించగా కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టించింది. ఇక ఈ చిత్రంలో వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్ కీల‌క‌పాత్ర పోషించ‌గా ఏఆర్ రెహ‌మాన్ సంగీతం అందించారు. స‌న్‌పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌లో ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించిన స‌ర్కార్ చిత్రం దీపావ‌ళి కానుక‌గా ఈరోజే ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. టీజ‌ర్, ట్రైల‌ర్ల‌తో ప్రేక్ష‌కుల్లో భారీగా అంచ‌నాలు పెంచేసిన స‌ర్కార్ ఎలా ఉందో ఈ స్మాల్ రివ్యూ ద్వారా తెలుసుకుందాం.

స‌ర్కార్ కథ సింగిల్ లైన్‌లో చెప్పాలంటే.. ఎన్నిక‌ల్లో దొంగఓటు.. క‌రెక్టుగా చెప్పాలంటే.. కుళ్ళిన రాజకీయ వ్యవస్థపై కార్పోరేట్ వ్యవస్థ వ్యవహారించే తీరే ఈ సర్కార్ అసలు కథ. ఇండియాలో త‌న ఓటుహ‌క్కును వినియోగించుకునేందుకు.. ఫారెన్ నుండి వ‌చ్చిన‌ కార్పోరేట్ రాక్ష‌సుడు సుంద‌ర్ (విజయ్) ఓటు ఎవ‌రో వేయ‌డంతో.. షాక్ అవుతాడు. కార్పోరేట్ రంగంలో ఓట‌మే ఎరుగ‌ని సుంద‌ర్.. త‌న‌కు అల‌వాటు లేని దారిలో అడుగు పెట్టి ఎలాంటి స‌మ‌స్య‌లు ఎదుర్కొన్నాడు.. వాటిని ఎలా అధిగ‌మించాడు.. ఇదే స‌ర్కార్ స్టోరీ.

ఇక ఎల‌క్ష‌న్ మూమెంట్‌లో మంచి లైన్ తీసుకున్న మురుగ‌దాస్ స‌రైన స్క్రిప్ట్ రాసుకోలేదు. కేవలం హీరో ఇమేజ్‌ను హైలెట్ చేస్తూ సీన్లు రాసుకున్న మురుగ‌దాస్ క‌థ‌,క‌థ‌నం విష‌యంలో పూర్తిగా ప‌ట్టుత‌ప్పాడు. దీంతో స‌ర్కార్ చిత్రం ఒక రోటీన్ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన్‌గా నిలించింది. తమిళ రాజకీయలకు దగ్గరగా ఉండేట్లు చాలా సన్నివేశాలను డిజైన్ చేసిన మురుగ‌దాస్.. ఎన్నికలు వాయిదా పడటం విజయ్ విలన్స్‌ని ఎదుర్కోవడం మాత్రం చాలా రొటీన్‌గా అనిపిస్తాయి.

ఇక ఫ‌స్టాఫ్ పేల‌వంగా తెర‌కెక్కించిన మురుగ‌దాస్.. సెకండాఫ్ కొంచెం ప‌ర్వాలేద‌నిపించినా.. కొన్ని సీన్స్ మాత్రం రొటీన్‌గా అనిపించ‌డమే కాకుండా పాత కథలను కూడా గుర్తు చేస్తాయి. ఇక ఈ చిత్రంలో విజయ్ న‌ట‌న కూడా అంతగా ఆకట్టుకోదు. కీర్తి సురేష్‌ ఉన్నా కేవలం పాటలకే అన్నట్టు ఉంటుంది. రెహ‌మాన్ సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్‌ కూడా అంతంత మాత్రంగానే ఉంది. గిరీష్ గంగాధరణ్ సినిమాటోగ్రఫీ ఒక్కటే ఈ సినిమాకి హైలెట్ అని చెప్పాలి. ఫైన‌ల్‌గా చెప్పాలంటే.. ఈ స‌ర్కార్ విజ‌య్ ఫ్యాన్స్‌కి త‌ప్పా మిగ‌తా సినీ అభిమానులకు న‌చ్చ‌డం చాలా క‌ష్టం.

  •  
  •  
  •  
  •  

Comments