సర్కార్ మూవీ ట్విట్టర్ టాక్.. బ్లాస్ట్ ద బాక్సాఫీస్..!

Tuesday, November 6th, 2018, 09:39:10 AM IST

త‌మిళ్ స్టార్ హీరో విజ‌య్, సెన్షేష‌న్ డైరెక్ట‌ర్ మురుగ‌దాస్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన చిత్రం స‌ర్కార్‌. ఈ ఇద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన గ‌త రెండు చిత్రాలు బ్లాక్ బ‌స్ట‌ర్ కావ‌డంతో హ్యాట్రిక్ చిత్ర‌మైన స‌ర్కార్ పై ప్రేక్ష‌కుల్లో భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. దీంతో ప్రేక్ష‌కుల అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టుగానే మంచి పొలిటిక‌ల్ బ్యాగ్రౌండ్‌తో తెర‌కెక్కింది స‌ర్కార్. ఈ క్ర‌మంలో దీపావ‌లి కానుక‌గా ఈరోజే ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన స‌ర్కార్ మూవీ ఇప్ప‌టికే ప్రీమియ‌ర్లు కంప్లీట్ చేసుకుంది. దీంతో సినిమా చూసిన ప్రేక్ష‌కులు త‌మ అభిప్రాయాన్ని ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేస్తున్నారు.

స‌ర్కార్ మూవీ ఫ‌స్టాఫ్ ప‌ర్వాలేద‌ని.. సెకండాఫ్ మాత్రం అదిరిపోయింద‌ని.. ట్వీట్ చేస్తున్నారు అభిమానులు. ఇక ఇంట‌ర్వెల్ బ్యాంగ్ మాత్రం అదిరిపోయింద‌ని.. థియేట‌ర్ మొత్తం పిన్‌డ్రాప్ సైలెన్స్ అని మ‌రో అభిమాని ట్వీట్ చేశాడు. ఇక సెకండాఫ్‌లో అదిరిపోయే డైలాగ్స్‌తో హాల్ మొత్తం ద‌ద్ద‌రిల్లిపోయింద‌ని.. పొలిటిక‌ల్ బ్యాక్‌డ్రాప్‌లో విజయ్ చెప్పిన డైలాగ్స్‌కి హాలు మొత్తం విజిల్స్‌తో హోరెత్తిపోతుంద‌ని ప‌క్కా ప‌వ‌న్ ప్యాక్ పొలిటిక్ డ్రామా అని ప్రేక్ష‌కులు ట్వీట్ చేస్తున్నారు. కీర్తి సురేష్ క్యూట్ ప‌ర్ఫామెన్స్, వ‌ర‌ల‌క్ష్మీ స్ట‌న్నింగ్ పర్ఫామెన్స్, విజ‌య్ మాసీవ్ ప‌ర్ఫామెన్స్, మురుగ‌దాస్ బ్రిలియంట్ టేకింగ్, ఏఆర్ రెహ‌మాన్ బ్యాగ్రౌండ్.. ఇలా అన్నీ అదిరిపోయాయ‌ని.. దీంతో స‌ర్కార్ ధ‌మాకా బాక్సాఫీస్ వ‌ద్ద మోత‌మోగించ‌డం ఖాయ‌మ‌ని విజ‌య్ అభిమానులు ట్వీట్ చేస్తున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments