స‌ర్కార్ ఇది నిజ‌మేనా.. ట్రేడ్ వ‌ర్గాలు షాకింగ్..!

Thursday, November 8th, 2018, 02:20:13 PM IST

మురగదాస్ – విజయ్ కాంబినేషన్‌లో వ‌చ్చిన మూడ‌వ‌ చిత్రం స‌ర్కార్. భారీ అంచ‌నాల‌తో దీపావ‌ళి కానుక‌గా ప్ర‌క్ష‌క‌ల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రం మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. ఇక తెలుగు ప్రేక్ష‌కులు అయితే బిలో యావ‌రేజ్ అని తేల్చేశారు. త‌మిళ‌నాడులో మాత్రం విజ‌య్ క్రేజ్‌తో బాక్సాఫిస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది. మొద‌టి రోజు అన్ని థియేట‌ర్ల‌లో హౌస్‌ఫుల్ క‌లెక్ష‌న్ల‌తో దూసుకుపోయిన స‌ర్కార్ రెండ‌వ‌రోజు కూడా అదే జోరును కొన‌సాగించింది.

ఈ క్ర‌మంలో ప్ర‌పంచ‌వ్యాప్తంగా రెండు రోజుల్లోనే 110కోట్ల గ్రాస్ క‌లెక్ట్ చేసి రికార్డు సృష్టించింది స‌ర్కార్. దీంతో ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 200 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ చిత్రం ఫుల్ రన్‌లో ఆ మొత్తాన్ని రాబట్టడం ఖాయంగా కనిపిస్తుంది. ఇక తెలుగులో డివైడ్ టాక్ వ‌చ్చినా.. క‌లెక్ష‌న్స్ మాత్రం భారీగానే వ‌చ్చాయ‌ని టాక్. రెండు తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్రాల్లో 7.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జ‌రగ్గా.. నెగిటీవ్ టాక్‌తోనే రెండు రోజుల్లో 4.34 కోట్లు వ‌సూలు చేసింది. దీంతో స‌ర్కార్ వ‌సూళ్ళు ట్రేడ్ వ‌ర్గాలను కూడా ఆశ్చ‌ర్యంలో ముంచెత్తుతుంది. ఇలాగే కంటిన్యూ అయితే స‌ర్కార్ ఫ‌స్ట్ వీకెండ్ క‌ల్లా బెంచ్ మార్క్ అందుకునే ఛాన్సెస్ ఎక్కువ‌గా ఉన్నాయ‌ని ట్రేట్ పండితులు అభిప్రాయ ప‌డుతున్నారు.