బాహుబలి పై కన్నేసిన విజయ్…!

Thursday, November 1st, 2018, 02:36:38 PM IST

ఇళయదళపతి విజయ్ హీరోగా సెన్సేషనల్ డైరెక్టర్ ఏ ఆర్ మురగదాస్ దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం సర్కార్, ఈ చిత్రాన్ని విజయ్ కెరీర్లోనే ఎన్నడూ లేనంత స్థాయిలో విడుదల చేయాలని ఈ సినిమా భావిస్తున్నారు, ఏకంగా 10వేల స్క్రీన్లలో విడుదల చేయాలనీ టార్గెట్ పెట్టుకున్నారట. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ 107కోట్ల వరకు జరిగినట్టు తెలుస్తుంది. తమిళనాడులో 83కోట్లు జరగగా, కేరళలో 8, కర్ణాటకలో 8, తెలుగు రాష్ట్రాల్లో 8 కోట్ల వరకు బిజినెస్ జరిగిందట.

ఈ సినిమాపై నెలకొన్న భారీ అంచనాలను బట్టి తమిళనాడులో 150-200 కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసే అవకాశం ఉన్నట్టు అక్కడి విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే తమిళ్ తో పోలిస్తే తెలుగు రాష్ట్రాల్లో సర్కార్ హడావుడి పెద్దగా కనిపించట్లేదు. విజయ్ కి తెలుగులో పెద్దగా మార్కెట్ లేకపోవటం, ప్రమోషన్స్ కు కూడా అంతగా ప్రాధాన్యం ఇవ్వకపోవటంతో జనాలు ఈ సినిమాని పట్టించుకోవట్లేదు. కాకపోతే ప్రపంచవ్యాప్తంగా బాహుబలి రికార్డులని క్రాస్ చేయడం కోసం ఈ సినిమా మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. మరి కథా సంబంధిత వివాదాల నుండి బయటపడి ఎట్టకేలకు విడుదలవుతున్న ఈ చిత్రం బాహుబలి రికార్డులని క్రాస్ చేస్తుందా లేదా అన్నది వేచి చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments