రివ్యూ : సర్కార్

Tuesday, November 6th, 2018, 12:52:42 PM IST

ఎఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన చిత్రం ‘సర్కార్’. దీపావళి కానుకగా ఈ రోజు ప్రేక్షకులముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం ..

కథ :

ఎన్నారై బిజినెస్ మెన్ అయిన సుందర్ ( విజయ్ ) తన ఓటు ను వినియోగించుకోవడానికి హైదరాబాద్ కు వస్తాడు. కానీ ఆయన ఓటు దుర్వినియోగం అవుతుంది. దీనిపై కోర్టు వెళుతాడు విజయ్. కోర్టు మళ్ళీ ఎన్నికలను నిర్వహించాలని ప్రభుత్వానికి ఆర్డర్ వేస్తుంది. అసలు విజయ్ ఓటును ఎవరు వినియోగిస్తారు ? ఈ కేసు తో కోమలవల్లి ( వరలక్ష్మి శరత్ కుమార్) ఆమె తండ్రి ( రాధా రవి) కి వున్న సంబందం ఏమిటి? ఎన్నికల్లో వున్నా చీకటి కోణాలను విజయ్ ఏవిందంగా బయటపెట్టాడు అన్నదే మిగితా కథ.

విశ్లేషణ :

సోషల్ మెసజ్ కి వాణిజ్య అంశాలను జోడించి తెరకెక్కించండంలో దిట్టయినా డైరెక్టర్ ఎఆర్ మురుగదాస్ ఈచిత్రాన్ని కూడా అదే పంథాలో తెరకెక్కించాడు. అయితే ఆప్రయత్నంలో పూర్తి స్థాయిలో విజయం సాదించలేకపోయాడు. ప్రస్తుతం సమాజంలో ఓట్లను ఎలా దుర్వినియోగ పరుస్తున్నారు అనే విషయాలను ఆసక్తికరంగా చూపెట్టాడు. ఇక నటీనటుల విషయానికి వస్తే హీరో విజయ్ వన్ మ్యాన్ షో తో సినిమా ని తన భుజాలపై వేసుకొని నడిపించాడు. ఆయన నటన ,స్టైలిష్ లుక్స్ ఈ చిత్రానికి చాలా ప్లస్ అయ్యాయి. ఇక వరలక్ష్మి శరత్ కుమార్ కూడా తన నటనతో విజయ్ కి పోటీనిచ్చింది. ముఖ్యంగా క్లైమాక్స్ లో ఆమె నటన అద్భుతమనే చెప్పాలి. హీరోయిన్ కీర్తి సురేష్ పెద్దగా ప్రాధాన్యం లేని పాత్రలో నటించగా విలన్ గా నటించిన రాదా రవి తన నటన తో మెప్పించారు. మొదటి భాగంలో వచ్చే రెండు యాక్షన్ ఎపిసోడ్లు చిత్రానికి హైలైట్ గా నిలిచాయి.

ప్లస్ పాయింట్స్ :

విజయ్ నటన , మేక్ఓవర్

ఫస్ట్ హాఫ్ లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్

వరలక్ష్మి శరత్ కుమార్ నటన

మైనస్ పాయింట్స్ :

సెకండ్ హాఫ్ నెమ్మదిగా సాగడం

సాంగ్స్

చిత్ర నిడివి ఎక్కువగా ఉండడం

తీర్పు :

పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో సోషల్ మెసేజ్ తో వచ్చిన ఈచిత్రం కొంత వరకు మాత్రమే ఆకట్టుకుంది. ఎంగేజింగ్ కథనంతో ఫస్ట్ హాఫ్ ను ఆసక్తికరంగా తెరకెక్కించిన మురుగదాస్ సెకండ్ హాఫ్ లో చాలా చోట్ల తడబడ్డాడు. ఫలితంగా ఈ చిత్రం బీలో యావరేజ్ చిత్రంగానే మిగిలిపోయింది.

Rating : 2.5/5