మహేష్ సర్కారు వారి పాట స్టోరీ లైన్ ఇదేనా!?

Wednesday, June 3rd, 2020, 08:35:51 AM IST

మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం ఇటీవల టైటిల్ కూడా ప్రకటించేశారు. సర్కారు వారి పాట అంటూ ఎవరూ ఊహించనీ రీతిలో టైటిల్ అనౌన్స్ చేశారు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ఒక స్టోరీ లైన్ ఇదే అంటూ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఈ చిత్రంలో మహేష్ బాబు అప్పుల అప్పారావు లా కనిపిస్తాడట. విదేశీ రాష్ట్రం లో ఉంటూ అక్కడి వారికి అప్పులిచే వాడిగా మహేష్ బాబు కనిపించనున్నారు. అయితే మహేష్ అప్పులు ఇచ్చే టపుడు, తీసుకునే సమయం లో చాలా ఖచ్చితంగా ఉంటాడు అట. అయితే మన మహేష్ బాబు అప్పులు వాసులు చేసేపుడు, ఇచ్చేపుడు జరిగే సంభాషణలు చాలా ఫన్నీ గా ఉంటాయి. అయితే ఈ సినిమా లో ఒక ఊహించిన ట్విస్ట్ కూడా ఉండే అవకాశం ఉంది.

సినిమా మొత్తం మహేష్ ఇదే పాత్రలో కనిపించనున్నారు. అయితే దర్శకుడు పరశురామ్ ఈ సారి ఫుల్ లెన్త్ ఎంటర్ టైనర్ ఇవ్వనున్నారు. గీతా గోవిందం తరహా లో అటు క్లాస్ ఆడయన్స్ ను, ఇటు మాస్ ఆడియన్స్ ను అలరించనున్నారు. అయితే ఇది నిజమో కాదో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. మహేష్ బాబు సరీలేరూ నీకెవ్వరూ చిత్రం తరవాత చేస్తున్న చిత్రం కావడం, అందులో టైటిల్ లో ప్రి లుక్ లో రూపాయి టాటూ తో మహేష్ మాస్ లుక్ లో అదరగొట్టడంతో మరొక బ్లాక్ బస్టర్ పక్కా అని తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.