సావిత్రి జీవితంలో ఆ కోణాన్ని దాచేశారా?

Wednesday, May 9th, 2018, 01:42:46 AM IST

మ‌హాన‌టి సావిత్రి చివ‌రి రోజుల్లో మ‌ద్యానికి బానిసై, అనారోగ్యంతో మ‌ర‌ణించిన సంగ‌తి తెలిసిందే. అయితే అందుకు అస‌లు కార‌ణం త‌న భ‌ర్త‌ జెమిని గ‌ణేష‌న్ అంటూ ప్ర‌జ‌ల్లో ప్ర‌చారం ఉంది. అయితే మ‌హాన‌టి సావిత్రి త‌ప్పేం లేదా? త‌ప్పంతా జెమినీ గ‌ణేష‌న్‌దేనా? అంటే.. అస‌లు జెమినీగ‌ణేష‌న్ పొర‌పాటు ఏమీ లేద‌న్న కోణాన్ని సావిత్రి అభిమానులే విశ్లేషిస్తున్నారు. జెమినీగ‌ణేష‌న్‌ని గుడిలో రెండో పెళ్లి చేసుకున్న సావిత్రి అత‌డంటే ఇష్ట‌ప‌డి చేసుకుంది. అప్ప‌టికే తెలుగు, త‌మిళ ప‌రిశ్ర‌మ‌ల్లో నంబ‌ర్ 1 నాయిక‌గా రాజ్య‌మేలుతున్న సావిత్రి, త‌మిళ ప‌రిశ్ర‌మ‌లో రొమాంటిక్ హీరోగా గుర్తింపు ఉన్న జెమినీ గ‌ణేష‌న్‌ని పెళ్లాడ‌డం అంతా సావిత్రి ఫోర్స్ వ‌ల్ల‌నే జ‌రిగింద‌ని చెబుతారు. అప్ప‌టికే పెళ్ల‌యి పిల్ల‌లు ఉన్న హీరోతో సావిత్రి పెళ్లి అప్ప‌ట్లో సంచ‌ల‌నం అయ్యింది. ఆ క్ర‌మంలోనే త‌న‌పైన నింద‌లు వేశారు. ఆ క్ర‌మంలోనే ఇద్ద‌రు భార్య‌ల‌తో క‌ల‌త‌లు మొద‌ల‌య్యాక జెమిని గ‌ణేష‌న్ మ‌ద్యం విచ్చ‌ల‌విడిగా తాగారు. త‌న‌తో పాటే సావిత్రి సైతం మ‌ద్యానికి బానిస‌య్యారు.

అస‌లు సావిత్రికి మ‌ద్యం అల‌వాటు చేసిందే జెమిని గ‌ణేష‌న్‌. అయితే అటుపై నైతికంగా దిగ‌జారిపోయేంత మాన‌సిక బ‌ల‌హీన‌త‌కు సావిత్రి గురైంది. అంత గొప్ప న‌టి, నైతికంగా కిందికి ప‌డిపోవ‌డం వ‌ల్ల చివరి రోజుల్లో మాట ప‌డాల్సి వ‌చ్చింది. ఒకానొక సంద‌ర్భంలో జెమిని గ‌ణేష‌న్ వేరొక అంద‌గ‌త్తెతో తాను ఎంతో ఇష్ట‌ప‌డి శ‌య‌నించే త‌ల్పంపై క‌నిపించ‌డంతో క‌కావిక‌లం అయిపోయిన సావిత్రి ఆ త‌ర‌వాత ఏం చేసింద‌న్న‌ది ఆద్యంతం ఎమోష‌నల్‌గా ఉంటుంద‌ని చెబుతారు. అయితే ఈ కథ మొత్తాన్ని య‌థాత‌థంగా వెండితెర‌పై చూపిస్తున్నారా? అన్న‌ది ప్ర‌స్తుతానికి స‌స్పెన్స్‌. మ‌రి కాసేప‌ట్లోనే సావిత్రి స‌మీక్ష‌లు వెబ్ లో ప్ర‌త్య‌క్షం కానున్నాయి. అంత‌వ‌ర‌కూ వేచి చూడాల్సిందే.