సవ్యసాచి మూవీ.. ట్విట్ట‌ర్ టాక్.. ఏది నిజం..!

Friday, November 2nd, 2018, 09:29:57 AM IST

అక్కినేని అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన స‌వ్య‌సాచి సినిమా ఈ శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. నాగ‌చైత‌న్య – చందూ మొండేటి కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన స‌వ్య‌సాచి చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మించిన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో మాధ‌వ‌న్ నెగిటీవ్ షేడ్స్ ఉన్న పాత్ర‌లో న‌టించ‌గా, భూమిక కీల‌క పాత్ర‌లో న‌టించింది. ఈ చిత్రంతో నిధి అగ్ర‌వాల్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఇక ఉద‌య‌మే యూఎస్‌లో ప్రీమియ‌ర్ షోలు కంప్లీట్ చేసుకున్న స‌వ్య‌సాచి చిత్రంలో ప్రేక్ష‌కులు ట్విట్ట‌ర్ ద్వారా త‌మ స్పంద‌న‌ను తెలియ‌జేస్తున్నారు.

డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌తో తెర‌కెక్కిన స‌వ్య‌సాచి చిత్రం..టీజ‌ర్, ట్రైల‌ర్ల‌తో ప్రేక్ష‌కుల్లో అంచ‌నాలు పెంచేసింది. అయితే ఎంతో ఆశ‌క్తితో థియేట‌ర్‌కి వెళ్ళిన ప్రేక్ష‌కుల్ని ద‌ర్శ‌కుడు నిరాశ‌ప‌ర్చాడ‌ని టాక్. మంచి క‌థ‌ను ఎంచుకున్న ద‌ర్శ‌కుడు చందూ మొండేటి.. ఆ క‌థ‌కి త‌గ్గ థ్రెడ్స్ క్రియేట్ చేయ‌డంలో విఫ‌ల‌మ‌య్యాడ‌ని, ఎంట‌ర్‌టైనింగా సాగాల్సిన ఫ‌స్టాఫ్ బోర్ కొట్టించాడ‌ని, ఇక సెకండాఫ్ అయినా థ్రిల్లింగ్‌గా ఉంటుద‌ని ఎదురు చూసిన ప్రేక్ష‌కుల‌కు బ్యాడ్ నెరేష‌న్‌తో నిరాశ‌ప‌ర్చాడ‌ని ట్వీట్ చేస్తున్నారు.

ఇక నాగ‌చైత‌న్య అస్స‌లు సెట్ కాలేద‌ని, వేరే హీరో అయితే బాగుండేద‌ని ట్వీట్లు చేస్తున్నారు కొంత‌మంది ప్రేక్ష‌కులు. అయితే మ‌రి కొంద‌రు మాత్రం స‌వ్య‌సాచి ఫ‌స్ట్‌ఫ్ చాలా ఎంట‌ర్‌టైనింగా ఉంద‌ని, చైతూ- నిధిల మ‌ధ్య వ‌చ్చే సీన్స్ బాగా పండాయ‌ని న‌వ్వులు పూయించాయ‌ని, ఇక సెకండాఫ్ అయితే చాలా థ్రిల్లింగ్‌గా ఉందని, నెగిటీవ్ షేడ్స్ ఉన్న క్యారెక్ట‌ర్‌లో మాధ‌వ‌న్ అద‌ర‌గొట్టాడ‌ని ట్వీట్లు చేస్తున్నారు. దీంతో ప్రీమియ‌ర్ షోలు ముగించుకున్న స‌వ్య‌సాచి చిత్రం పై ప్రేక్ష‌కుల నుండి మిక్స్‌డ్ టాక్ వ‌స్తుంది. మ‌రి తెలుగు రాష్ట్రాల్లో స‌వ్య‌సాచి టాక్ ఎలా ఉంటుందో చూడాలి.