“లవ్ స్టోరీ” కు మంచి ధరే పలికిందట.!

Wednesday, June 3rd, 2020, 12:05:00 PM IST

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మరియు సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా తెరకెక్కించిన “ఫిదా”తో దర్శకుడు శేఖర్ కమ్ముల సాలిడ్ బౌన్స్ బ్యాక్ ఇచ్చారు. తన ప్రతీ సినిమాకు ఎప్పటిలానే ఎక్కువ గ్యాప్ తీసుకున్నట్టుగానే ఆ తర్వాత కూడా కాస్త గ్యాప్ ఇచ్చి ముద్దలు పెట్టిన చిత్రం “లవ్ స్టోరీ”.

యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం కూడా మూవీ లవర్స్ ఎంత గానో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే అంతిమ దశలో ఉన్న ఈ చిత్రంకు సంబంధించి ఓ వార్త ఇప్పుడు బయటకొచ్చింది.

ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను మన తెలుగు స్ట్రీమింగ్ యాప్ “ఆహా” 6 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది. ఇంత మొత్తం ఈ చిత్రం అందులోను ఆహా నుంచి మంచి డీసెంట్ మొత్తం అని చెప్పాలి. థియేటర్స్ ఓపెన్ చేసాక ఎంజాయ్ చేద్దామని చాలా మంది ఎదురు చూస్తున్నారు.