సీనియర్ నటుడు గొల్లపూడి మారుతీరావు కన్నుమూత

Thursday, December 12th, 2019, 02:59:16 PM IST

అలనాటి ప్రముఖ నటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావు కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న మారుతీరావు చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య చిత్రంతో నటుడిగా వెండితెరకు పరిచయమయ్యారు. దాదాపు 290 చిత్రాల్లో నటించి తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమాలోకి రంగ ప్రవేశం చేయకుముందు నుండి నాటకాలు, కథలు, నవలలు ఎన్నో రాశారు. రచయిత గా కూడా మంచి పేరు, గుర్తింపు తెచ్చుకున్నారు.

గొల్లపూడి మారుతీరావు 1939 ఏప్రిల్ 14 న విజయనగరం లో ఒక మధ్య తరగతి కుటుంబంలో జన్మించారు. ఆత్మగౌరవం, కళ్ళు సినిమాలకు గానూ గొల్లపూడి మారుతీరావు నంది పురస్కారాన్ని అందుకున్నారు. మాస్టారి కాపురం సినిమాకు ఉత్తమ సంభాషణల రచయితగా నంది అవార్డుని గెలుచుకున్నారు.