సెన్సేషనల్ న్యూస్ : భరత్ లో ఆ సీన్లు హైలైట్ కానున్నాయట!

Monday, April 9th, 2018, 07:49:40 PM IST


సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, కొరటాల శివ దర్శకత్వం లో నటిస్తున్న నూతన చిత్రం భరత్ అనే నేను. ఈ చిత్రం ఫస్ట్ ఓత్, అలానే ది విజన్ ఆఫ్ భరత్, ఇక ప్రస్తుతం విడుదలయిన ఈ చిత్రంలోని పాటలు, ట్రైలర్. ఇలా ఒకటేంటి చెప్పుకుంటూ పోతే ఈ చిత్తరంలోనే ప్రతి ఒక్కటి యూట్యూబ్ లో సంచలనాలు నమోదుచేస్తున్నాయి. విడుదలకు ముందే ఇంత హంగామా చేస్తున్న ఈ సినిమా రేపు విడుదల తర్వాత ఇంకెలా ఉంటుందో అని సూపర్ స్టార్ ఫాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. ఇక అసలు విషయం లోకి వెళితే, మంచి మెసేజి ఇవ్వడంతో పాటు తన చిత్రాలలో మంచి హీరో ఎలేవేషన్ సీన్స్ , అలానే యాక్షన్ సీన్స్ సమపాళ్లలో జొప్పిస్తుంటారు కొరటాల.

ఇప్పటికే ట్రైలర్ లో చూపించిన కొన్ని యాక్షన్ సీన్స్ కి ఫాన్స్ సంబరపడిపోతున్నారు. తన మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజీ చిత్రాలు చూస్తే ఆ విషయం మనకు అర్ధం అవుతుంది. ఇది భరత్ అనే నేను లో కూడా అబ్బురపరిచే ఫైట్స్, యాక్షన్ సన్నివేశాలు వున్నాయట. సూపర్ స్టార్ మహేష్ ఛరిష్మాకి తగ్గట్లు ఆయన ఫాన్స్ కోరుకునే అన్ని అంశాలు ఈ చిత్రంలో పుష్కలంగా ఉన్నాయని సమాచారం అందుతోంది. ఇక ప్రీ ఇంటర్వెల్, ప్రీ క్లైమాక్స్, అలానే సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని యాక్షన్ సీన్స్ అదిరిపోతాయని, మరీ ముఖ్యంగా చిత్రంలో హోలీ సందర్భంగా వచ్చే ఒక ఫైట్ ఫాన్స్ ని థ్రిల్ చేస్తుందని అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు.

బ్రహ్మోత్సవం, స్పైడర్ వంటి చిత్రాలతో ఫ్లాప్స్ తో కొంత డీలా పడ్డ మహేష్ బాబు, ఈ చిత్రంతో కేవలం ఆయన అభిమానులనే కాక ప్రేక్షకులందరిని మెప్పిస్తారని యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. మరోవైపు మొన్న విడుదలయిన ట్రైలర్ ప్రస్తుతం యూట్యూబ్ లో దుమ్ము రేపుతోంది. మరి ఈనెల 20న విడుదల కానున్న భరత్ ఇంకెన్ని రికార్డులు బద్దలు కొడుతుందో వేచి చూడాలి మరి…

  •  
  •  
  •  
  •  

Comments