షారూఖ్ ఖాన్ కి జస్ట్ మిస్ .. త్రుటిలో పెను ప్రమాదం తప్పింది

Sunday, November 20th, 2016, 03:41:07 PM IST

shahrukh-khan
బాలీవుడ్ కే కింగ్ అయిన బాద్షా షారూఖ్ ఖాన్ కి పెద్ద ప్రమాదం తప్పడం తో ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఆయన కొత్త సినిమా డియర్ జిందగీ షూటింగ్ శరవేగంగా సాగుతుండగా షారూఖ్ , అలియా లు గల్లీ రోడ్ల మీద చక్కర్లు కొట్టే సీన్ ని చిత్రీకరణ చేస్తున్నారు. దాని కోసం ఒక టెంపో లో ఆ సామాన్లు తీసుకుని వచ్చారు. టెంపో ఆగిఉన్న చోట షారూఖ్ సైకిల్ మీద నుంచున్నాడు. అయితే, షారుఖ్ ను గమనించని డ్రైవర్ టెంపోను స్టార్ట్ చేసి ముందుకు దూకించాడు. దీంతో, అది సైకిల్ మీదనుంచి వెళ్లిపోయింది. దీన్ని గమనించిన షారుఖ్ వెంటనే పక్కకు తప్పుకోవడంతో… అతనికి పెను ప్రమాదం తప్పింది. దీంతో, యూనిట్ సభ్యులంతా ఊపిరి పీల్చుకున్నారు.