గ్రీన్ ఇండియా ఛాలెంజ్: పార్కును దత్తత తీసుకున్న హీరో శర్వానంద్..!

Tuesday, July 14th, 2020, 09:00:41 AM IST

టాలీవుడ్‌ హీరో శర్వానంద్‌ గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా బంజారాహిల్స్‌లోని తన ఇంటి పక్కన ఉన్న పార్కును దత్తత తీసుకున్నాడు. జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌, ఎంపీ సంతోష్‌ కుమార్‌, ఎమ్మెల్యే దానం నాగేందర్‌తో కలిసి పార్కులో మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా శర్వానంద్ మాట్లాడుతూ భవిష్యత్తులో ఆక్సిజన్‌ కొనుక్కునే దుస్థితి ఏర్పడకూడదంటే ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని మరియు వాటిని జాగ్రత్తగా సంరక్షించాలని పిలుపునిచ్చారు. ఏకే ఎంటర్‌ప్రైజెస్‌ అనిల్‌ సుంకర, 14రీల్స్‌ గోపి ఆచంట, రామ్‌ ఆచంట, యూవీ క్రియేషన్స్‌ వంశీ, విక్కీ, ప్రమోద్‌, ఎస్‌ఎల్‌ఎన్‌ సుధాకర్‌ చెరుకూరిలను కూడా మొక్కలు నాటాలని నామినేట్ చేశారు.