శేఖర్ కమ్ముల నెక్స్ట్ సినిమాలో కొత్త హీరో ?

Friday, October 12th, 2018, 10:57:50 AM IST

ఫిదా బంపర్ హిట్ తరువాత మళ్ళీ స్పీడ్ పెంచిన శేఖర్ కమ్ముల నెక్స్ట్ సినిమా విషయంలో బిజీ అయ్యాడు. ఇప్పటికే దానికి సంబందించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని ఏషియన్ ఫిలిమ్స్ బ్యానర్ పై సునీల్ నిర్మిస్తున్నాడు. ఆసియన్ ఫిలిమ్స్ బ్యానర్ పై ఇన్నాళ్లు నైజాం లో డిస్ట్రిబ్యూటర్స్ గా ఉన్న ఈ సంస్థ ఇప్పుడు నిర్మాణ రంగంలోకి అడుగులు వేస్తుంది. తోలి ప్రయత్నంగా శేఖర్ కమ్ములతో సినిమాకు రెడీ అయ్యారు. అయితే ఈ చిత్రంలో కొత్త వాళ్లే నటిస్తారట. నిజానికి శేఖర్ తో సినిమా చేయడానికి పలువురు హీరోలు వెయిటింగ్ లో ఉన్నారు .. అయినా సరే అయన కొత్త హీరోతోనే సినిమాకు ప్లాన్ చేస్తుండడం విశేషం. త్వరలోనే ఆడిషన్స్ ద్వారా హీరోని ఎంపిక చేస్తారట. అన్నట్టు ఈ సినిమాలో ఇద్దరు హీరోలు ఉంటారట .. అందులో ఒకరు కొత్త హీరో అయితే రెండో వ్యక్తి ఇండస్ట్రీ కి పరిచయం ఉన్న ఫ్యామిలి నుండి వస్తాడట. ఈ సినిమాకు సంబందించిన మరిన్ని వివరాలు ఈ రెండు మూడు రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది.