“బుట్ట బొమ్మ” పాటకి బాలీవుడ్ హీరోయిన్ ఫిదా!

Sunday, February 9th, 2020, 05:16:05 PM IST

అల్లు అర్జున్, పూజ హెగ్డే జంటగా నటించిన అలా వైకుంఠపురంలో చిత్రం విడుదల అయి నాన్ బాహుబలి రికార్డులని నెలకొల్పుతుంది. అయితే ఈ చిత్రంలోని పాటలు సౌత్ ఇండియా ని షేక్ చేసాయి. అయితే ఈ చిత్రంలోని బుట్ట బొమ్మ పాటకి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శిల్ప శెట్టి ఫిదా అయింది. ఈ పాటకి అద్భుతమైన డాన్స్ వేసి సోషల్ మీడియా లో పోస్ట్ చేసింది, అంతే, కొద్దీ నిమిషాల్లోనే ఈ వీడియో కాస్త వైరల్ గా మారింది. అయితే అభిమానులు శిల్ప శెట్టి డాన్స్ కి ఫిదా అవుతున్నారు. శిల్ప శెట్టి డాన్స్ సూపర్బ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

సంక్రాంతి బరిలో నిలిచిన అలా వైకుంఠపురంలో చిత్రం దిగ్విజయంగా బాక్సఫీస్ వద్ద ఇంకా కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఈ చిత్రానికి థమన్ అందించిన సంగీతం అదనపు బలం అని చెప్పాలి. త్రివిక్రమ్ శ్రీనివాస దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఫై బాలీవుడ్ సైతం ఫిదా అయింది. తాజాగా ఒక బడా నిర్మాణ సంస్థ అలా వైకుంఠపురంలో చిత్ర రీమేక్ హక్కులని కొనేసింది.