మహేష్ అభిమానులకు షాకింగ్ న్యూస్..!

Saturday, October 19th, 2019, 10:49:21 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రష్మికా మందన్న హీరోయిన్ గా అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం “సరిలేరు నీకెవ్వరు”. వరుసగా రెండు బ్లాక్ బస్టర్స్ అందుకున్న తర్వాత ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.అయితే ఈ చిత్రాన్ని మొదలు పెట్టిన రోజునే ఈ చిత్రాన్ని వచ్చే ఏడాదై సంక్రాంతికి విడుదల చేస్తున్నామని చెప్పేసారు.ఇదిలా ఉండగా ఈ చిత్రాన్ని జనవరి 12న విడుదల చేస్తున్నామని చెప్పేసారు.

కానీ అదే రోజున అల్లు అర్జున్ నటిస్తున్న “అల వైకుంఠపురములో” కూడా ఉండడంతో అసలు ఆరోజు పెద్ద యుద్ధమే తప్పదని ఇద్దరి హీరోల అభిమానులతో పాటు మొత్తం సినీ వర్గాలు కూడా ఒక్కసారిగా ఆ రోజు ఎలా ఉంటుందో అని ఊహల్లోకి వెళ్లిపోయారు.అయితే ఈ విషయంలో మహేష్ అభిమానులకు మాత్రం షాకిచ్చే వార్త ఇప్పుడు సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది.”సరిలేరు నీకెవ్వరు” సినిమా ఒకరోజు ముందుకు వచ్చిందని అంటే జనవరి 11న సినిమా విడుదల కాబోతున్నట్టు తెలుస్తుంది.దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు కానీ ఇప్పుడు అయితే ఇది వైరల్ అవుతుంది.