బాబోయ్ .. గ్లామర్ తో చంపేస్తున్న శ్రియ ?

Wednesday, September 19th, 2018, 10:25:13 AM IST

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా దశాబ్ద కాలంపాటు సౌత్ లో టాప్ హీరోయిన్ గా ఓ రేంజ్ ఇమేజ్ తెచ్చుకున్న గ్లామర్ భామ శ్రియ అంటే ఎంత క్రేజో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఈ మద్యే ఈ అమ్మడికి వరుస పరాజయాలు పలకరిస్తుండడంతో .. అవకాశాలు తగ్గాయి .. అయినా కొంత గ్యాప్ తీసుకుని సెకండ్ ఇన్నింగ్ మొదలై పెట్టిన పెద్దగా లాభం లేకపోయింది. దాంతో పెళ్లి చేసుకున్న శ్రియ మళ్ళీ సినిమాల్లో బిజీ అయ్యేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తుంది. ప్రస్తుతం సీనియర్ హీరోలకు కరెక్ట్ జోడిగా మారడంతో ఈమెకు మళ్ళీ అవకాశాలు వస్తున్నాయి .

అయితే శ్రియ ఇంకా తనలో ఏమాత్రం గ్లామర్ తగ్గలేదని పలు ఈవెంట్స్ లో ప్రూవ్ చేస్తూనే ఉంది .. అసలే అందగత్తె .. అందులోను గ్లామర్ ని ఒలకపోయడం అంటే ఎలావుంటుంది చెప్పండి .. ఈ మద్యే జరిగిన సైమా అవార్డు వేడుకల్లో శ్రియ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మిగిలింది .. కుర్ర హీరోయిన్స్ కు పోటీగా గ్లామర్ ను ఆరబోస్తూ ఈ అమ్మడు దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో సంచలనం రేపుతున్నాయి. ఫోటోలు చూసినవాళ్లంతా బాబోయ్ శ్రియ గ్లామర్ తో చంపేస్తుంది పో అంటూ రకరకాల కామెంట్స్ పెడుతున్నారు. టెన్నిస్ ఆటగాడు అండ్రు కొన్షిప్ ని పెళ్లాడాక ఈ అమ్మడికి ఇంకా గ్లామర్ పెరిగిందని కామెంట్స్ వస్తున్నాయి. మొత్తానికి ఈ అమ్మడికి రసిక హృదయాల నాడి బాగా పట్టేసినట్టుంది .. !!