ఇలా `శ్రుతి`మించిన షికార్ల వెన‌క‌?

Sunday, February 25th, 2018, 11:28:09 PM IST

అందాల క‌థానాయిక శ్రుతిహాస‌న్ వైఖ‌రిలో మార్పు గ్ర‌హించారా? శ‌్రుతి ఇటీవ‌లి కాలంలో సినిమాల‌పై కంటే వ్య‌క్తిగ‌త జీవితంపైనే ఎక్కువ శ్ర‌ద్ధ క‌న‌బ‌రుస్తోంది. త‌న గురించి, త‌న బోయ్‌ఫ్రెండ్ గురించి ఎక్కువ‌గా కేర్ తీసుకుంటోంది త‌ప్ప అస్స‌లు త‌న సినీకెరీర్ ఏమ‌వుతుందో అన్న బెంగ ఏమాత్రం క‌న‌బ‌ర‌చ‌డం లేదు. దీపం ఉండ‌గానే చ‌క‌చ‌కా సంపాదించేసుకుని, ఇప్పుడు వ్య‌క్తిగ‌త జీవితాన్ని ఓ ప్ర‌ణాళిక ప్ర‌కారం నిర్మించుకునేందుకు ప్లాన్ చేస్తోంది. ఆ క్ర‌మంలోనే బోయ్‌ఫ్రెండ్ మైఖేల్ కోర్స‌లేను ఇంట్లో ప‌రిచ‌యం చేసింది. అయితే అత‌డిని పెళ్లాడే ముందు మ‌రికాస్త ఎక్కువ‌గానే బ్యాచిల‌ర్ లైఫ్‌ని ఆస్వాధించేందుకు శ్రుతి ప్లాన్ చేసుకుంది.

అదంతా స‌రే.. శ్రుతి వాల‌కం చూస్తుంటే ప‌లు సందేహాల‌కు తావిస్తోంది. ఈ భామ ఇటీవ‌లి కాలంలో న‌గ‌రంలోనే ఉంటున్నా ఎవ‌రికీ క‌నిపించడం లేదు. ఇదిగో ఇలా ఎక్కువ‌గా కాజువ‌ల్స్‌లో క‌నిపిస్తోంది. విప‌రీత‌మైన మోడ్ర‌న్ లుక్‌ని ఫాలో చేసినా సింపుల్ డ్రెస్‌లో ద‌ర్శ‌న‌మిస్తోంది. న‌గ‌రంలోనే ఉంటున్నా .. అస‌లు శ్రుతి ఏం చేస్తోంది? అన్న‌ది ఎవ‌రికీ ఏమీ అర్థం కావ‌డం లేదు. అస‌లేం చేస్తోందంటారు? ఏమో పైవాడికే ఎరుక‌!