అర్జున్ పై లిఖిత పూర్వ‌కంగా.. పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేసిన శృతి..!

Monday, October 29th, 2018, 10:26:27 AM IST

దేశ‌వ్యాప్తంగా ప్ర‌కంప‌న‌లు రేపుతున్న మీ..టూ ఉధ్య‌మంలో భాగంగా న‌టి శృతి హ‌ర‌హ‌ర‌న్ ఇటీవ‌ల సీనియ‌ర్ హీరో అర్జున్ పై లైంగిక వేధింపుల ఆరోప‌ణ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. శృతి ఆరోప‌ణ‌ల పై స్పందించిన అర్జున్.. తాను ఎలాంటి లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డ‌లేద‌ని.. శృతి చేసిన ఆరోప‌ణ‌లు త‌న ప‌రువుకు భంగం క‌లిగించాయ‌ని.. దీంతో ఈ వ్య‌వ‌హారం పై న్యాయ‌స్థానం లోనే తేల్చుకుంటాన‌ని అర్జున్ వ్యాఖ్యానించిన సంగ‌తి తెలిసిందే.

అయితే ఆ త‌ర్వాత క‌న్న‌డ స్టార్ హీరో అంబ‌రీష్‌.. ఈ వ్య‌వ‌హారంలోకి ఎంట‌రై ఇద్ద‌రినీ రాజీ చేయ‌డానికి ప్ర‌య‌త్నించ‌గా.. ఇద్ద‌రు నై..నై అన్నారు. అయితే అర్జున్ వ‌ర్గీయులు శృతి పై 5కోట్ల ప‌రువు న‌ష్టం దావా వేశార‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఈ నేప‌ధ్యంలో శృతి ఏకంగా పోలీస్ స్టేష‌న్‌కి వెళ్ళి అర్జున్ పై లిఖిత పూర్వ‌కంగా ఫిర్యాదు చేయ‌డం ఇప్పుడు సినీ వ‌ర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇక ఆ పిర్యాదులో భాగంగా అర్జున్ ఓ సినిమా షూటింగ్‌లో భాగంగా డైరెక్ట‌ర్ చెప్ప‌కుండానే నా ప్రైవేట్ పార్ట్స్ పై చేతులు వేసి నొక్కాడ‌ని.. డైరెక్ట‌ర్ చూస్తుండ‌గాన న‌న్ను హ‌గ్ చేసుకొని న‌లిపేశాడ‌ని శృతి పోలీసుల‌కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. మ‌రి శృతి ఫిర్యాదు పై పోలీసులు ఎలాంటి యాక్ష‌న్ తీసుకుంటారో చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments