సిద్ధ ఫస్ట్ లుక్ రిలీజ్.. తండ్రీ కొడుకుల లుక్ అదిరిందిగా..!

Saturday, March 27th, 2021, 12:00:04 PM IST

మెగస్టార్ చిరంజీవి హీరోగా సక్సెస్‌ ఫుల్‌ చిత్రాల దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న తాజా చిత్రం ఆచార్య. అయితే ఈ సినిమాలో మెగాపవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ కూడా ఓ కీలకపాత్రలో నటిస్తున్నాడు. అయితే నేడు చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఆచార్య చిత్ర యూనిట్ సిద్ధ ఫస్ట్ లుక్‌ని రిలీజ్ చేసింది. ఇందులో చిరంజీవి, రామ్ చరణ్ ఇద్దరు తుపాకీలు పట్టుకుని నడుచుకుంటూ వస్తున్నారు. అయితే తండ్రీ కొడుకుల లుక్ అదిరిపోయిందంటూ మెగా అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

అయితే ఈ సినిమాలో చిరు సరసన కాజల్ నటిస్తుండగా, రామ్ చరణ్కు జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. మ్యాట్నీ మూవీస్‌తో కలిసి రామ్ చరణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. మే 13న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఇదిలా ఉంటే రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో కూడా నటిస్తున్నాడు. అయితే చరణ్‌కి సంబంధించి నిన్న ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి విడుదలైన పోస్టర్ కూడా అభిమానులను ఆకట్టుకుంది.