కైలాష్ ఖేర్ నన్ను వేధించాడంటున్న గాయని ?

Thursday, October 11th, 2018, 12:29:07 AM IST

సినిమా పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ వ్యవహారం పెద్ద దుమారమే రేపుతోంది. ఇప్పటికే పలువురు హీరోయిన్స్ ఈ విషయంలో ఘటగానే తన జీవితంలో జరిగిన సంఘటనలు బాహాటంగానే బయటపెడుతున్నారు. తాజాగా తనుశ్రీ దత్త .. వ్యవహారం జోరందుకున్న నేపథ్యంలో మీ టూ అంటూ ఓ కాంపైన్ జరుగుతూనే ఉంది .. ఇందులో పలువురు హీరోయిన్స్ ఘాటుగా స్పందిస్తూ ఈ కాంపైన్ కు సపోర్ట్ అందిస్తున్నారు. తాజాగా బాలీవుడ్ గాయని సోనా మహాపాత్ర తనను సింగర్ ఖైలాష్ ఖేర్ లైంగికంగా వేధించాడంటూ కామెంట్ చేసింది. ఖైలాష్ ఖేర్ ఎవరా అని షాక్ అవుతున్నారా .. ఆ మధ్య మిర్చి సినిమాలో పండగల దిగివచ్చాడు అంటూ ఓ రేంజ్ లో పాట పడిన గాయకుడూ ..

ఈ మద్యే భరత్ అనే నేను లో వచ్చాడయ్యో సామి అంటూ సింగర్ గా మంచి క్రేజ్ తెచ్చుకున్న సింగర్. ఓ రోజు ఖైలాష్ ఖేర్ ని కలిశానని ఆ సమయంలో ఇద్దరం మాట్లాడుకునే సమయంలో అయన నువ్వు చాలా అందంగా ఉన్నావంటూ నాపై చేతులు వేసాడని చెప్పింది. ఓ పాట సందర్బంగా ఇది జరిగిదని .. ఆ సాంగ్ పూర్తయ్యాక తనను తన గదికి రమ్మని ఒత్తిడి చేసాడని చెప్పింది. అందుకే అతని స్టూడియోకు వెళ్ళలేదాని చెప్పింది. మరి ఈ విషయం పై ఖైలాష్ ఎలా స్పందిస్తాడో చూడాలి.