గెట్ రెడీ రెబల్ ఫ్యాన్స్..”సాహో” నుంచి లేటెస్ట్ అప్డేట్!

Sunday, June 9th, 2019, 09:05:45 PM IST

బాహుబలి రెండు సినిమాల తర్వాత ప్రభాస్ అభిమానులకు “సాహో” చిత్రంతో పడిగాపులు మళ్ళీ తప్పలేదు.అలాంటి భారీ చిత్రాల తర్వాత ప్రభాస్ ఆ అంచనాలకు తగ్గ సినిమాలు చేస్తాడా చెయ్యడా అన్న అనుమానాలకు తెర దించేలా “సాహో” ఉండనుంది అని ఇప్పటికే మనకు అర్ధం అయ్యింది.అలాగే సుజీత్ కూడా ఎక్కడా తగ్గకుండా ఉన్నత ప్రమాణాలతో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.అయితే గత కొన్ని రోజుల క్రితమే విడుదలకు సమయం దగ్గర పడుతుండడంతో “సాహో” నుంచి తమకు అప్డేట్ కావాల్సిందే అని ప్రభాస్ అభిమానులు ట్విట్టర్ లో పెద్ద ఎత్తున ట్రెండ్ చేసారు.

దీనితో ఈ రోజు వారికి ఒక అప్డేట్ దొరికింది.ప్రముఖ సినీ నిర్మాత ఎస్ కె ఎన్ అస్సలు సాహో పేరు కూడా పెట్టకుండా అప్డేట్ ఉందని చిన్న హింట్ ఇచ్చారు.దీనితో అభిమానులు అడగగా రేపు అప్డేట్ ఉండబోతుంది అన్నట్టు ఖరారు చేసేసారు.అయితే ఇప్పుడు తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం రేపు టీజర్ కు సంబంధించి డేట్ ను ఓ పోస్టర్ ద్వారా విడుదల చేసే అవకాశం ఉంటుందని తెలుస్తుంది.మరి వీరేం వదులుదాం అనుకుంటున్నారో తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.300 కోట్ల భారీ వ్యయంతో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఆగష్టు 15న విడుదల కానుంది.