థియేటర్స్ రూపు రేఖలు మారుతున్నాయా?

Sunday, May 31st, 2020, 06:28:00 PM IST


కరోనా దెబ్బకు ప్రపంచ వ్యాప్తంగా ఎనలేని విప్లవాత్మక మార్పులే సంభవిస్తున్నాయని చెప్పాలి. అయినప్పటికీ జనం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కాకపోతే ఇక ముందు నుంచి రాబోయే రోజుల్లో అలాంటి వారు కూడా తప్పక తమ జీవనశైలి మార్చుకోవాల్సిందే అని చెప్పాలి.

కరోనా దెబ్బ ముఖ్యంగా సినిమా రంగంపై మరింత ప్రభావం చూపుతుంది. దీనితో ఎక్కడో కాదు మన తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్స్ రూపు రేఖలు మారుతున్నాయి. సినిమా థియేటర్ లో ఎలా ఉంటుందో ప్రతీ ఒక్కరికి తెలుసు.

సీట్లు దగ్గరదగ్గరగా ఉండే సీట్లు కాస్తా ఇప్పుడు సోషల్ డిస్టెన్స్ పాటిస్తున్నాయి. ఇలా సోషల్ డిస్టెన్స్ పాటించాల్సిన సీట్లు హైదరాబాద్ లో దర్శనం ఇచ్చాయి. అక్కడ ఆర్టీసీ సుదర్శన్ థియేటర్ లో సీట్లు ఇప్పుడు మరింత దూరం జరుగుతున్నాయి.

ఆ పనులకు సంబంధించిన ఫొటోలే ఇప్పుడు సోషల్ మీడియాలో బయటకొచ్చాయి. మరి ఇదొక్కటేనా రాబోయే రోజుల్లో అన్ని థియేటర్స్ వారు కూడా ఇలాగే అమలు చేస్తారా అన్నది తేలాల్సి ఉంది.