దేవి దెబ్బకు “మైండ్ బ్లాక్”పై దారుణమైన ట్రోల్ల్స్!

Wednesday, December 4th, 2019, 01:40:40 PM IST

ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు మహేష్ నటిస్తున్న కొత్త చిత్రం “సరిలేరు నీకెవ్వరు” ఫస్ట్ సింగిల్ తో కాస్త అయోమయ పరిస్థితిలో ఉన్నారని చెప్పాలి.మహేష్ అభిమానులు ఎంతగానో ఎదురు చూసిన ఈ పాట వారి అంచనాలను తలకిందులు చేసిందని ఓ పక్క మహేష్ ఫ్యాన్స్ బాధపడుతుంటే మరోపక్క ఈ సాంగ్ సోషల్ మీడియాలో పెద్ద ట్రోల్ మెటీరియల్ గా మారిపోయింది.

దీనితో ఓ పక్క ఫేస్బుక్ మరియు మరోపక్క ట్విట్టర్లో వాయించేస్తున్నారు.దేవిశ్రీ “మైండ్ బ్లాక్” సాంగ్ తో నిజంగానే మైండ్ బ్లాక్ చేసాడని ట్రోల్స్ వేస్తున్నారు.ఈ పాటలోని రెండు మూడు ట్యూన్ లు ఆల్రెడీ ఇంతకు ముందు ఉన్నవే అని అసలు ఈ పాట టైటిల్ నే నేను శైలజ లోని టైటిల్ సాంగ్ లో లేపేసారని వీడియోలు పెట్టి మరీ ట్రోల్స్ వేస్తున్నారు.దీనితో దేవి మరోసారి సోషల్ మీడియాలో బలైపోయాడు.అయినా దేవి సరైన ట్యూన్ లు కట్టకపోతే వారు మాత్రం ఏం చేస్తారు ఇలాగే ట్రోల్స్ చేస్తారు.ఇక ముందు నుంచి అయినా దేవి కాస్త ఫ్రెష్ ట్యూన్స్ ఇస్తే బాగుంటుంది.