మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్, నభా నటేష్ జంటగా కొత్త దర్శకుడు సుబ్బు తెరకెక్కించిన ‘సోలో బ్రతుకే సో బెటర్’ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న థియేటర్స్లో విడుదలైన సంగతి తెలిసిందే. కరోనా కారణంగా విధించిన లాక్డౌన్ తర్వాత థియేటర్లలో విడుదలవుతున్న మొదటి చిత్రం ఇదే కావడంతో ప్రేక్షకులు నుంచి కూడా ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది.
అయితే థియేటర్లలో 50 శాతం సీటింగ్ కెపాసిటీతో కూడా ఈ సినిమా మంచి కలెక్షన్లను సొంతం చేసుకుంటుంది. ఈ సినిమా విడుదలైన తొలిరోజే 4 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. రెండో రోజు కూడా 3 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి పర్వాలేనిపించింది. ఇకపోతే మూడో రోజు సైతం ఈ సినిమా మంచి వసూళ్లను సాధించింది. మూడోరోజు కూడా 3 కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసింది. మూడు రోజుల్లో ఈ సినిమా 10 కోట్లకు పైగా గ్రాస్, 6 కోట్ల షేర్ వసూలు చేసింది.