“అల వైకుంఠపురములో” టీజర్ కు యాంటీ ఫ్యాన్స్ ఏదో చేసేలా ఉన్నారే..

Saturday, October 19th, 2019, 06:01:06 PM IST

ఇప్పుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా త్రివిక్రమ్ దర్శకత్వంలో “అల వైకుంఠపురములో” అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి అందరికి తెలిసిందే.అయితే మన తెలుగు సినిమాలో ఫ్యానిజం పేరిట కొంతమంది ఆకతాయి ఫ్యాన్స్ తమ అభిమాన హీరో సినిమా తప్ప మరే హీరో సినిమా కూడా గొప్ప కాదు అన్న రేంజ్ లో మాట్లాడుతుంటారు.అయితే ఎవరి హీరో వారికే గొప్ప కానీ మరో హీరో అభిమానితో ప్రస్తావన వచ్చినపుడు మాత్రం పెద్ద ఎత్తున వాగ్వాదాలు నడుస్తాయి.

ఇవి ముదిరితే చాలా దూరం కూడా వెళ్తాయి.వీళ్ళ పనులు వల్ల వారు అభిమానించే హీరోల మధ్య దూరం కూడా ఎక్కువయ్యిపోతుంది.కానీ అవేవి మాత్రం వీరు ఆలోచించరు.ఇప్పుడు మాత్రం అల్లు అర్జున్ సినిమా విషయంలో కొంతమంది యాంటీ ఫ్యాన్స్ ఏదో ప్లానింగ్ వేస్తున్నట్టు తెలుస్తుంది.కొన్ని రోజుల్లో అల వైకుంఠపురములో టీజర్ విడుదల చేస్తారన్న సంగతి ఇప్పటికే బయటకు వచ్చింది.కానీ ఇప్పుడు ఈ టీజర్ కు భారీ ఎత్తున డిస్ లైక్స్ కొట్టాలని వారు అనుకుంటున్నట్టు తెలుస్తుంది.ఇప్పుడిప్పుడే మన తెలుగు పరిశ్రమ నుంచి మంచి మంచి సినిమాలు వస్తున్నాయి.కానీ మనం మాత్రం ఇక్కడే గొడవలు చేసుకుంటూ హిట్టవ్వాల్సిన సినిమాలను ప్లాప్ చేసుకుంటూ పోతున్నాం.మరి ఇలాంటి వీరంతా ఎప్పుడు మారుతారో ఏంటో..