RRR : రాజమౌళిపై నమ్మకం లేదా..ఒట్టి పుకార్లేనా..?

Wednesday, October 16th, 2019, 07:42:35 PM IST

ఒక్క తెలుగు సినిమా ఖ్యాతిని మాత్రమే కాకుండా భారతదేశ సినిమా పరిశ్రమను ప్రపంచవ్యాప్తంగా మరే దర్శకుడు చాటనంతగా దర్శక ధీరుడు రాజమౌళి వ్యాప్తి చెందించారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.రాజమౌళి కంటే కూడా ముందే ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేసి పడేసిన దర్శకులే ఇప్పుడు రాజమౌళిని అందుకోలేకపోతున్నారు.అంతే కాకుండా అసలు ఓటమి అనేది ఎరుగని దర్శకుడు రాజమౌళి.తాను ఈ ప్రాజెక్ట్ చేస్తున్నాడు అంటే ఇక తిరుగు లేకుండా అది స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్ అయ్యినట్టే అని చెప్పాలి.

అలాగే తన సినిమాను ఎలా ప్రమోట్ చేసుకోవాలో కూడా రాజమౌళికి బాగా తెలుసు.అలాంటి రాజమౌళి తెరకెక్కిస్తున్న RRR సినిమాపై ఇప్పుడు చాలా మంది సందేహిస్తున్నారు.అందులోను చాలా సిల్లీ పాయింట్ తో కేంద్రీకరించడం విశేషం.తాజాగా “సైరా” చిత్రం విడుదల అయ్యి హిందీలో దారుణంగా విఫలం అయ్యింది.దీని ఎఫెక్ట్ వల్ల అంట రాజమౌళి తన చిత్రాన్ని అనుకున్న డేట్ కు విడుదల చెయ్యకుండా వచ్చే ఏడాది దసరాకు విడుదల చేస్తారని సినీ వర్గాల్లో ఇప్పుడు టాక్ నడుస్తుంది.

ఇతర కారణాల వల్ల సినిమా వాయిదా వేశారు అంటే ఎవరన్నా నమ్ముతారు కానీ ఈ పాయింట్ మీద ప్రచారం జరుగుతుంటే మాత్రం అది అసలు నమ్మబుద్ది కావట్లేదు.అసలు తెలుగు సినిమాను హిందీ సినిమాలనే బీట్ చేసే స్థాయికి మార్కెట్ పెంచింది రాజమౌళి.ఇంకా చెప్పాలి అంటే ఎస్ ఎస్ రాజమౌళి అనే మార్క్ మూలానే “బాహుబలి” సిరీస్ కు క్రేజ్ వచ్చింది.ఇప్పుడు అలాంటి రాజమౌళియే భయపడుతున్నారని ఒక వర్గం పుకార్లను వ్యాప్తి చేస్తుంది.ఇలాంటి వార్తలు విన్నపుడు నవ్వాలో ఇలాంటి వాటిని ప్రచారం చేస్తున్న వారిపై జాలిపడాలో అర్ధం కానీ పరిస్థితులు ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో నెలకొన్నాయి.