నైజీరియన్ చేతుల్లో మోసపోయిన హీరోయిన్ సోనాక్షి వ‌ర్మ..!

Wednesday, June 12th, 2019, 06:30:49 PM IST

రోజురోజుకు సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఇన్ని రోజులు సామాన్యులని టార్గెట్ చేసుకున్న వీరు ఇప్పుడు పెద్ద పెద్ద బిజినెస్‌మేన్లను, సెలబ్రేటీలను టార్గెట్ పెట్టుకున్నారు. అయితే ఇల్లాంటి వాటిపై పోలీసులు ప్ర‌జ‌ల‌కు ఎప్ప‌టిక‌ప్పుడు జాగ్ర‌త్త‌లు చెబుతున్నా కూడా ప్ర‌జ‌లు మాత్రం ఏదో ర‌కంగా సైబర్ నేరగాళ్లను నమ్మి మోస‌పోతూనే ఉన్నారు. అయితే తాజాగా హీరోయిన్ సోనాక్షి వ‌ర్మ కూడా సైబర్ నేరగాళ్ల బారిన పడింది.

అయితే సోనాక్షి వ‌ర్మ‌కు కొన్ని రోజుల క్రితం మెర్రిన్ కిర్రాక్ అనే నైజీరియ‌న్ తన ఫేస్‌బుక్‌కి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాడు. అయితే దానిని పెద్దగా ఆలోచించకుండా ఫేస్‌బుక్‌ ఫ్రెండ్ రిక్వెస్ట్ ఓకే చేసింది. అంతేకాదు మెర్రిన్ కిర్రాక్ అనే నైజీరియ‌న్‌తో సోనాక్షి అప్పుడప్పుడూ ఛాటింగ్ కూడా చేసేది. అయితే అదే అదునుగా తీసుకున్న ఆ సైబర్ నేరస్తుడు సోనాక్షికి ఫోన్ చేసి మన స్నేహానికి గుర్తుగా నైజీరియా నుంచి నీకు విలువైన బహుమతి పంపుతున్నానని చెప్పాడు. అయితే ఒక వారం రోజుల తరువాత ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ నుండి మాట్లాడుతున్నాను మీకు ఒక పార్శిల్ వచ్చింది ఇది మెకు అందించాలంటే రూ. 85 వేలు కట్టాల్సి ఉంటుందని ఫోన్ చేసి చెప్పారు. అయితే విలువైన వస్తువు పంపాడనుకున్న సోనాక్షి వెంటనే ఎయిర్‌పోర్ట్ అధికారి అని చెప్పిన వ్యక్తి అకౌంట్‌కు రూ.85వేలు ట్రాన్స్‌ఫ‌ర్ చేశారు. అయితే వారం, పది రోజులు గడిచినా గిఫ్ట్ ఇంకా ఇంటికి చేరకపోవడంతో అనుమానం వచ్చి తనకు ఎయిర్‌పోర్ట్ నుండి చేస్తున్నామని ఫోన్ చేసిన నంబర్‌కు కాల్ చేయగా స్విచ్చాఫ్ అని రావడంతో మోసపోయానని తెలుసుకున్న సోనాక్షి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే కేసు నమోదు చేసుకున్న ప్రస్తుతం ఆ సైబర్ నేరస్తుడిని పట్టుకునే పనిలో ఉన్నారు.