స్టార్ డాటర్, అందాల సోనమ్ కపూర్ పెళ్లి ఆనంద్ అహూజాతో అంగరంగ వైభవంగా జరగనుంది. ఆ మేరకు అధికారికంగా చాలానే లీకులందాయి. అయితే ఈ వార్తను సోనమ్ కానీ, సోనమ్ తరపు బంధువులు కానీ ఓపెన్‌గా చెప్పేందుకు ఎందుకో నసుగుతూనే ఉన్నారు. అదంతా అటుంచితే ఓవైపు పెళ్లిపనుల్లో సోనమ్ ఫ్యామిలీ బిజీబిజీగా ఉంది. అటువైపు అహూజాలు అన్ని ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు. మే 8 – మే12 మధ్యలో ఈ వివాహం జరగనుందని తెలుస్తోంది.
ఇక పెళ్లి పనుల్లో భాగంగా సోనమ్‌కి అనామిక ఖన్నా పెళ్లి దుస్తుల్ని డిజైన్ చేస్తున్నారు. తాజా అప్ డేట్ ప్రకారం.. వెన్యూ ఎక్కడో కూడా ఫిక్స్ చేసేశారని తెలుస్తోంది. వాస్తవానికి సోనమ్ పెళ్లి జెనీవాలో ఓ కళ్యాణ మండపంలో జరుగుతుందని ప్రచారం సాగింది. కానీ తాజా సమాచారం ప్రకారం.. ఈ పెళ్లి జెనీవాలో కాదు, ముంబైలోనే ఉంటుందని తెలుస్తోంది. ఇక్కడే ఓ ఖరీదైన విల్లాలో, బీచ్ రిసార్ట్ వంటి చోట వివాహం జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. మొత్తానికి ఈ పెళ్లికి ఇంకో నెలరోజుల సమయం మాత్రమే మిగిలి ఉందని మాత్రం అభిమానులకు అర్థమైంది.