ఎన్టీఆర్ కు బిగ్ బాస్ హౌస్ మేట్స్ అద్ధిరిపోయే ట్రీట్…ఆ వీడియోను విడుదల చేయనున్న థమన్!

Tuesday, May 19th, 2020, 05:50:04 PM IST

మే 20 న జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు పురస్కరించుకొని కొందరు అభిమానులు, సిని ప్రేమికులు ఎన్టీఆర్ కు సర్ప్రైజ్ వీడియో లను అందజేస్తున్నారు. అయితే ఈ నేపధ్యంలో ఒక ఆసక్తికర ప్రకటన ఎన్టీఆర్ అభిమానులకు సంతోషం కలిగిస్తుంది. తెలుగు నాట బిగ్ బాస్ రియాలిటీ షో కి మొదటిసారిగా జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాత గా వ్యవహరించారు. తెలుగు లో అంతగా పేరు సంపాదించుకోవడానికి ఎన్టీఆర్ ఒక కారణం అని చెప్పాలి. అయితే బిగ్ బాస్ షో కి సంబంధించిన హౌజ్ మేట్స్ అందరూ కలిసి ఒక వీడియో ను తయారు చేశారు.

జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఈ వీడియో ను ఉదయం 9:30 గంటలకు సంగీత దర్శకుడు తమన్ ద్వారా విడుదల చేయనున్నారు. అయితే ఈ వీడియో ఎలా ఉంటుంది అనే దాని పై అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే కొందరు సెలబ్రిటీలు ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా సర్ప్రైజ్ లు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నారు. అయితే ఇపుడు తమన్ విడుదల చేయబోయే వీడియో ఎలా ఉంటుంది అనే దాని పై ఆసక్తి నెలకొంది.

అయితే రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రౌద్రం రణం రుధిరం అనే చిత్రం నుండి ఎటువంటి ఫస్ట్ లుక్ లేదా వీడియో ను విడుదల చేయడం లేదు అని చిత్రం బృందం ఇటీవల ప్రకటించింది. అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ మరొక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ లేదా టైటిల్ ను రేపు అనౌన్స్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.