ఆ ఫేస్బుక్ పోస్టులు పెట్టింది నేను కాదు–శ్రీ రెడ్డి

Sunday, November 17th, 2019, 11:00:51 AM IST

శ్రీ రెడ్డి అంటే తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకు ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగు రాష్ట్రాల్లో ఎంతో క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ వున్న పవన్ కళ్యాణ్ ని దూషించడం తో సెలబ్రిటీ అయిపోయింది. సినీ పరిశ్రమ పై పలు సంచలనాత్మక విమర్శలు చేస్తూ పబ్బం గడుపుకుంటుంది. అయితే ఇటీవలే ఉదయనిధి పై శ్రీ రెడ్డి ఫేస్బుక్ లో సంచలన పోస్ట్ పెట్టింది. అయితే ఆ పోస్ట్ తాను పెట్టింది కాదని, అసలు ఉదయనిధిని ఇప్పటివరకు నేరుగా చూడలేదని తెలిపింది. అయితే ఉదయనిధి పై శ్రీ రెడ్డి ఆరోపణలు చేసింది అని ప్రచారం జోరుగా జరుగుతుండటం తో ప్రెస్ మీట్ ప్రసాద్ లాబ్స్ చెన్నై లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది.

అయితే ఉదయనిధి పై పోస్ట్ పెట్టింది తాను కాదని, ఫేస్బుక్ లో తన పేరిట చాలానే నకిలీ ఖాతాలు ఉన్నాయని తెలిపింది. ఎవరో కావాలనే ఉదయనిధి పేరు ప్రతిష్టలని దెబ్బతీయడానికి చేస్తున్న చర్యలు అని తెలిపింది. ఏ విషయానికి సంబంధించి సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేసానని అన్నారు. అయితే క్యాస్టింగ్ కోచ్ విషయం లో ఎంతగా పోరాడిన మద్దతు దక్కలేదని తెలిపింది. తమిళ ప్రజలు ఆదరిస్తున్నారు, త్వరలోనే రాజకీయ ప్రవేశం చేయబోతున్నాని తెలిపింది. అయితే ఇప్పటివరకు అవకాశాల కోసం చాల చేశా, ఇక పై అలా చేయనని తెలిపింది.