బాబోయ్ .. లీకులు మొదలు పెట్టిన శ్రీ రెడ్డి ?

Tuesday, March 27th, 2018, 01:16:25 AM IST


ఇటీవలే పలు సంచలనతో పెద్ద దుమారమే రేపిన శ్రీరెడ్డి వ్యాఖ్యలు మరవకముందే తాజాగా ఆమె సోషల్ మీడియా లో పలు సీక్రెట్స్ బయటపెడతానంటూ చెప్పిన విషయం తెలిసిందే. టాలీవుడ్ లో జరిగే కాస్టింగ్ కౌచ్ కు సంబంధించి పలు విషయాలపై బాహాటంగా మాట్లాడిన ఈ అమ్మడు మొదటి లీక్ ని సోషల్ మీడియా లో లీక్ చేసింది. టాలీవుడ్ లో 99 శాతం మంది ఆడవాళ్లను వాడుకునేవారేనని పలు సార్లు చెప్పిన ఈ అమ్మడు వాటికి తన వద్ద పక్కా అధరాలు ఉన్నాయని, వారి బాగోతాన్ని బయటపెడతానని చెప్పింది. ముందుగా చెప్పినట్టుగా శ్రీ రెడ్డి ఈ లీక్ లను స్టార్ట్ చేసింది. లీక్స్ స్టార్టెడ్ అంటూ ఓ ఫోటోను పోస్ట్ చేసింది శ్రీరెడ్డి .. ఆ ఫొటోలో ఓ వ్యక్తి శ్రీరెడ్డి ని ముద్దు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్టు ఉంది. మరి ఈ వ్యవహారం పై ఆమె ఎంతమంది బండారం బయటపెడుతుందో అన్న టెన్షన్ పరిశ్రమలో ఎక్కువైంది.