ఆ హీరోయిన్ కు పెయింటింగ్ గిఫ్ట్ గా ఇచ్చిన శ్రీదేవి!

Friday, March 2nd, 2018, 02:35:18 AM IST

అలనాటి అందాల తార శ్రీదేవి మనకు ఒక గొప్ప నటిగా బాగా తెలుసు. అయితే ప్రేక్షకులకు తన ముగ్ధ మనోహరరూపం, నటనతో అతిలోకసుందరిగా అలరించిన ఆమెలో మనకు తెలియని మరొక అద్భుత కళ దాగి వుంది . ఆమె పెయింటింగ్స్ అందంగా వేయడంలో దిట్ట. తన ఖాళీ సమయాల్లో ఫైటింగ్స్ వేస్తూ వాటిని తన స్నేహితులకు బహుమతిగా ఇవ్వడం కూడా ఆమెకు బాగా అలవాటు. అయితే ఆవిధంగా కండల వీరుడు సల్మాన్ ఖాన్ కూడా శ్రీదేవి నుండి పెయింటింగ్ ను బహుమతిగా పొందిన కొద్దిమందిలో ఒకడు.

కాగా కొన్నాళ్ళు పెయింటింగ్స్ కు బ్రేక్ ఇచ్చినప్పటికీ సల్మానే దస్ కా దమ్ అనే టీవీ షో లో భర్త బోనీ తో వచ్చిన శ్రీదేవికి మళ్ళీ తాను పెయింటింగ్ వేయడం మొదలుపెట్టమని సలహా ఇచ్చారట. ఆయన సలహాతో అప్పటినుండి మళ్ళీ బ్రష్ పట్టుకున్న శ్రీదేవి, ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్, అనిల్ కపూర్ కుమార్తె సోనమ్ కపూర్ కు కూడా తన పెయింటింగ్ లో ఒకటి బహుమతీగ అందించిందట . సోనమ్ కపూర్ మొదటి సినిమా అయిన సావారియా రిలీజ్ సందర్బంగా ఆమెకు ఆ బహుమతి ఇచ్చినట్టు తెలుస్తోంది.

ఒక అందమైన అమ్మాయి పెయింటింగ్ ను శ్రీదేవి సోనమ్ కు బహుమతిగా ఇచ్చారు. 54 ఏళ్ల వయసులో కన్నుమూసిన శ్రీదేవి చేసిన సినిమాలు, గీసిన పెయింటింగ్సే ఆమె మనకు మిగిలిన జ్ఞాపకాలు అని పలువురు ఆ అనుభూతులను గుర్తుచేసుకుంటున్నారు….