శ్రీకాంత్ అడ్డాల.. మరో సినిమా పట్టేసాడు ?

Friday, June 1st, 2018, 03:32:29 AM IST

ఒక్క ఫ్లాప్ అతని జీవితాన్ని అడ్డంగా మార్చేసింది. అంతకు ముందు తీసిన రెండు సూపర్ హిట్స్ కూడా గాల్లో కలిసిపోయాయి. ఇంతకి ఆ దర్శకుడు ఎవరన్నా విషయం మీకు అర్థం అయి ఉంటుంది కదా .. అతనే దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. మహేష్ తో చేసిన బ్రహ్మోత్సవం సినిమా భారీ పరాజయం పాలవడంతో ఆ తరువాత ఆయనకు ఏ హీరో అవకాశం ఇవ్వలేదు. ఆ తరువాత ఒకరిద్దరు హీరోల పేర్లు వినిపించాయి కానీ అవేవి వర్కవుట్ కాలేదు. తాజాగా శ్రీకాంత్ అడ్డాల మెగా కాంపౌండ్ లో ఛాన్స్ పట్టేసాడని అంటున్నారు. ఈ విషయం పై అల్లు శిరీష్ పుట్టిన రోజు సందర్బంగా అడిగితె .. ఓ రేంజ్ లో షాక్ అయి జవాబు చెప్పాడు. శ్రీకాంత్ అడ్డాలతో నేను సినిమా చేయడం లేదు .. అసలు నేను అతన్ని ఎప్పుడు కలిసింది లేదు అని చెప్పాడు. అయితే మీ బ్యానర్ లో సినిమా ఉంటుందని అంటున్నారు కదా అంటే .. ఉండొచ్చు .. శ్రీకాంత్ అడ్డాల రెండు సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చాడు. ఒక్క ప్లాప్ సినిమా తీసినంత మాత్రాన అతని టాలెంట్ ని తక్కువగా అంచనా వేయలేం అని అన్నాడు. అంటే అల్లు శిరీష్ కు ఎక్కడో సాఫ్ట్ కార్నర్ ఉన్నట్టే. ఇక సినిమా సంగతి ఏమిటో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే .