మొత్తానికి శ్రీకాంత్ అడ్డాలకు ఓకే చెప్పిన హీరో ?

Friday, October 12th, 2018, 11:40:44 AM IST

బ్రహ్మోత్సవం సినిమా ఇచ్చిన పరాజయం ఆ దర్శకుడికి అవకాశాలను దూరం చేసింది. ఎన్ని ప్రయత్నాలు చేసిన అవకాశం దక్కలేదు. ఇక్కడ అంతే మరి .. సినిమా రంగంలో కేవలం సక్సెస్ మాత్రమే మాట్లాడుతుంది. అందుకే ఆ దర్శకుడికి ఎవరు అవకాశం ఇవ్వలేదు .. దాంతో గట్టి ప్రయత్నాలు చేసిన శ్రీకాంత్ అడ్డాల మొత్తానికి ఓ క్రేజీ హీరోని ఒప్పించాడు. ఇంతకీ ఆ హీరో ఎవరో తెలుసా .. నాచురల్ స్టార్ నాని. ప్రస్తుతం నానితో సినిమా కు రంగం సిద్ధం చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ గీత ఆర్ట్స్ నిర్మిస్తుంది. నాని కోసం మంచి స్క్రిప్ట్ చెప్పాడట శ్రీకాంత్.. అందుకే నాని కూడా ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. సో త్వరలోనే ఈ సినిమాకు సంబందించిన న్యూస్ దసరాకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.