శ్రీరెడ్డి కొత్త అవతారం.. చూస్తే భయపడడం ఖాయం..!

Saturday, February 22nd, 2020, 07:07:22 PM IST

వివాదస్పద నటి శ్రీరెడ్డి కొత్త అవతారంలో కనిపించి అభిమానులకు షాక్ ఇచ్చింది. అయితే ఎప్పుడూ హాట్ దుస్తులలో లేదా సాంప్రదాయ చీరకట్టులో కనిపించే శ్రీరెడ్డి ఒక్కసారిగా కాషాయం దుస్తులు ధరించి, మెడలో రుద్రాక్షలు వేసుకుని, వంటి నిండా విబూతి పూసుకుని అఘోరాగా కనిపించింది.

అయితే ఇందంతా శివరాత్రి కోసం ఓ వీడియో్‌ని తీసేందుకు ఇలా అఘోరాగా కనిపించింది శ్రీరెడ్డి. అయితే వంటి నిండా బూడిద, నుదిటిన పసుపు, మెడచుట్టూ రుద్రాక్షలు వేసుకుని ఇద్దరు అఘోరాల పక్కన శ్రీరెడ్డి చేసిన చేష్టలు, విన్యాసాలు, డ్యాన్స్‌లు అచ్చం అఘొరాల మాదిరిగానే భయంకరంగా కనిపించాయి. ఏదేమైనా శ్రీరెడ్డి ఇలా కొత్తగా కనబడడంతో ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.