రెచ్చిపోతున్న వివాదాల నటి – ఈసారి టార్గెట్ మరో శృంగార తార

Thursday, November 14th, 2019, 01:45:52 AM IST

ఎన్నో వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయినటువంటి ప్రముఖ వివాదాల నటి శ్రీరెడ్డి మరొకసారి తనదైన రీతిలో పలు విమర్శలు చేసింది. కానీ ఈసారి టార్గెట్ చేసింది ఎవరినంటే… ప్రముఖ శృంగార తార షకీలా… కాగా శ్రీరెడ్డి ఎప్పుడు ఎవరిని టార్గెట్ చేరిన కానీ ఎదో ఒక వివాదంలో ఎవరినో ఒకరిని బయటకు లాగుతుంది. దానికి తోడు ఎవరైనా సరే తన మీద వివాదాస్పద వాఖ్యలు చేసిన కూడా తనదైన శైలిలో శ్రీరెడ్డి రెచ్చిపోయి ఇష్టమొచ్చినట్లు తిడుతుంది కూడా. ఇదివరకు తెలుగు చిత్ర పరిశ్రమలోని ప్రముఖులందరిని కూడా తన ఖాతాలో వేసుకున్న శ్రీరెడ్డి ఇప్పుడు మరొక శృంగార తార మీద పడింది.

ఇకపోతే శృంగార తార షకీలా తన మీద గతంలో కొన్ని వివాదాస్పద వాఖ్యలు చేసినప్పటికికూడా తను అంటే నాకు చాలా గౌరవం అని చెప్పుకొచ్చింది ఈ వివాదాల నటి శ్రీరెడ్డి. అంతేకాకుండా షకీలా తో చాలా సార్లు ఫోన్ లో మాట్లాడానని, తన మీద ఉన్నటువంటి గౌరవంతో తనకు సంబందించిన ఇంటర్వ్యూ లు కూడా చూసేదానినని, ఆమెకి సంబందించిన పలు ఇంటర్వ్యూ లు చుశాకనే షకీలా చాలా ఉత్తమురాలు అని తెలిసిందని శ్రీరెడ్డి చెప్పుకొచ్చింది.,