వీరిని నిరాశపరుస్తున్న “స్టార్ మా”.?

Tuesday, May 19th, 2020, 01:21:32 PM IST

ఈ లాక్ డౌన్ సమయంలో మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తున్న తెలుగు ఛానెల్స్ లో స్టార్ మా కూడా ఒకటి. అయితే ఇతర ఛానెల్స్ తో పోలిస్తే స్టార్ మా వారు అందించే ఎంటర్టైన్మెంట్ కాస్త భిన్నంగానే ఉందని చెప్పాలి. ఒక్క తెలుగు సినిమాలు మాత్రమే కాకుండా బాలీవుడ్ మరియు హాలీవుడ్ సినిమాలు కూడా ఇస్తూ మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు.

కానీ ఈ విషయంలోనే స్టార్ మా వీక్షకులు కాస్త నిరాశలో ఉన్నారు. వీరు ఇస్తున్న హాలీవుడ్ చిత్రాలు స్టార్ మా ఛానెల్లో ప్రసారం చేస్తున్నారు కానీ పర్టిక్యులర్ గా ఏ ఛానెల్లో ప్రసారం చేస్తున్నారని సరైన సమాచారం ఇవ్వడం లేదు. ఇదే ఘటన మొన్న అవెంజర్స్ ఎండ్ గేమ్ సినిమాను ప్రసారం చేసినపుడు ఎదురైంది.

అంత పెద్ద హాలీవుడ్ చిత్రాన్ని అంతా హెచ్ డి ఛానెల్లో ఇస్తారు అనుకుంటారు కానీ మామూలు ఛానెల్లో ఇస్తారు అనుకోలేదు. కానీ సీన్ కట్ చేస్తే ఈ సినిమాను కూడా అందులో ప్రసారం చెయ్యలేదు. దీనితో మార్వెల్ ఫ్యాన్స్ బాగా నిరాశలో ఉన్నారు.