ఇప్పటికీ మెగాస్టార్ దే పైచేయి!

Friday, January 19th, 2018, 10:00:43 AM IST

మెగాస్టార్ చిరంజీవి సినిమాలకు గుడ్ బై చెప్పి రాజకీయ రంగ ప్రవేశం చేసిన తరువాత ఆయన నెంబర్ వన్ స్థానం కోసం మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ మధ్య గట్టి పోటీ జరిగింది. అయితే ఇప్పటికీ ఇద్దరిలో ఎవరు నెంబర్ వన్ అంటే చెప్పడం నిజంగా కష్టమనే అనాలి. అయితే మొత్తానికి మెగాస్టార్ కొంత కాలం విరామం తర్వాత తిరిగి మేకప్ వేసుకున్నారు. ఆయన ఖైదీ నెంబర్ 150 చిత్రం తో రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ చిత్రానికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. యూనివర్సల్ సబ్జెక్టు కావడం, మెగాస్టార్ తన స్టెప్స్ తో అదరగొట్టడం, అందునా ఫాన్స్ కోరుకునే అన్ని అంశాలు అందులో ఉండడంతో ఆ చిత్రం నాన్ బాహుబలి రికార్డులు సాధించి, మెగాస్టార్ పవర్ ఇంకా తగ్గలేదని మరొక్క సారి నిరూపించింది. అయితే అసలు విషయం ఏంటంటే గత సంవత్సరం విడులయిన ఖైదీ మొత్తం కలెక్షన్ 104 కోట్లుగా వుంది. ఇప్పటివరకు మొన్న స్పైడర్ గా వచ్చిన మహేష్ బాబు గాని, నిన్న అజ్ఞాతవాసిగా వచ్చిన పవన్ కళ్యాణ్ గాని దాన్ని అందుకోవడం లో విఫలమయ్యారు. ఈ విధంగా చూస్తే ఖైదీ 150 పేరిట వున్న ఆ రికార్డు ను ఎవరు అందుకోలేక పోవడంతో మెగాస్టార్ చిరంజీవి తానే నెంబర్ వన్ అని మరొక్కసారి నిరూపణ అయినట్లు ఇండస్ట్రీ జనాలు అంటున్నారు. ఇటీవల విదలయిన బాహుబలితో ప్రభాస్ జాతీయ స్థాయి నటుడిగా ఎదిగారు, ఆయన మార్కెట్ పరిధి కూడా పెరిగింది. జూనియర్ యన్టీఆర్, బన్నీ లు కూడా మంచి విజయాలతో తమ మార్కెట్ ను పెంచుకుంటూ వెళ్తున్నారు. కాబట్టి భవిష్యత్తులో మహేష్ లేదా పవన్ ఈ రికార్డుని బద్దలు కొడతారా లేక మరి ఏ ఇతర నటుడైనా దానిని బద్దలు కొడతాడా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు…